టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రం చేస్తున్నారు. ఆచార్య అనే టైటిల్ తో రానున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ మేలో మొదలుకానుంది. ఇప్పటికే చాల వరకు షూటింగ్ హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక కాలనీ సెట్ లో చిత్రీకరించారు. షూటింగ్ సెట్స్ నుండి చిరంజీవి లుక్ బయటికి లీక్ కాగా, విప్లవ భావాలు కలిగిన సామాజికవాదిలా కనింపించారు.
కాగా ఈ చిత్రంలో ఓ కీలక రోల్ ఉండగా అది మహేష్ లేదా చరణ్ లలో ఒకరు చేస్తున్నారంటూ కథనాలు వస్తున్నాయి. ఐతే దీని వెనకున్న అసలు కథను చిరంజీవి తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఈ చిత్రం కోసం మొదట నుండి చరణ్ ని అనుకుంటున్నారట. దర్శకుడు కొరటాల శివ కూడా చరణ్ నే ఆ పాత్ర కోసం అనుకున్నారట. ఐతే మహేష్ పేరు ఎలా తెరపైకి వచ్చిందో చిరంజీవికి అర్థం కాలేదట.
మహేష్ తో నటించడం ఆనందం కలిగించే విషయం అయినప్పటికీ ఆయన్ని ఈ సినిమా కోసం అనుకోలేదట. చిరంజీవి భార్య సురేఖ కూడా చరణ్ నటిస్తే చూడాలని ఉంది అని ఆశపడ్డారట. ఐతే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న చరణ్ ఈ మూవీ కోసం డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టం, అలాగే రాజమౌళి అనుమతి ఇస్తే తప్పా చరణ్ ఈ మూవీలో నటించడం కుదరదు. నా చిత్రంలో చరణ్ నటించాలన్న సురేఖ కోరిక తీరాలంటే రాజమౌళి అనుమతి కావలసిందే అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
Most Recommended Video
ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్