విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన చిత్రం ‘ఎఫ్ 2’. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.
నిజానికి ‘ఎఫ్2’ టీజర్ విడుదలవ్వక ముందు.. ఈ చిత్రం పై ఎలాంటి అంచనాలు లేవు. దీపావళి కానుకగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కూడా ‘షాపింగ్ మాల్’ బ్యానర్ లా ఉందంటూ ట్రోల్ల్స్ చేసారు. అయితే ఎప్పుడైతే టీజర్ విడుదలయ్యిందో.. చిత్రం పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ట్రైలర్ విడుదలయ్యాక సంక్రాంతి విజేత ‘ఎఫ్2’ నే అంటూ చాలా మంది ఫిక్సయిపోయారనే చెప్పాలి.
ఇక అందరి అంచనాలను నిజం చేస్తూ.. ఈ చిత్రం మొదటి వారం భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. వెంకటేష్ కి మంచి ఫ్యామిలీ ఇమేజ్ తో పాటూ సంక్రాంతి హీరో అనే ట్యాగ్ ఉండడంతో ‘ఎఫ్2’ చిత్రాన్ని ఘానవిజయం దిశగా నడిపిస్తుంది. ఇక పండుగ పూర్తయ్యాక కూడా ఈ చిత్రం మంచి వసూళ్ళనే రాబడుతుండడం విశేషం. మొదటి వారం పూర్తయ్యే సరికి.. ఈ చిత్రం 42.9 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఏరియా విజ్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం – 11.82 కోట్లు
సీడెడ్ – 4.71 కోట్లు
వైజాగ్ – 4.75 కోట్లు
ఈస్ట్ – 4.26 కోట్లు
వెస్ట్ – 2.37 కోట్లు
గుంటూరు – 3.14 కోట్లు
కృష్ణ – 3.12 కోట్లు
నెల్లూరు – 1.18 కోట్లు
ఓవర్సీస్ – 4.65 కోట్లు
కర్ణాటక – 2.2 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 70 లక్షలు
మొత్తం షేర్ : 42.9 కోట్లు (66.7 కోట్ల గ్రాస్)
మరో వారం రోజులు ‘ఎఫ్2’ చిత్రం ఇదే దూకుడు చూపిస్తే .. ఇప్పటి వరకూ మిడిల్ ఆర్డర్ సినిమాలలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ కలెక్షన్లను దాటేయడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. 2018 లో వరుస ప్లాపులతో నష్టాలు చవి చుసిన దిల్ రాజుకి ‘ఎఫ్2’ చిత్రం మళ్ళీ సక్సెస్ ట్రాక్… ఎక్కించిందనే చెప్పాలి. మరి ‘ఎఫ్2’ ఇంకెన్ని కలెక్షన్లను రాబడుతుందో చూడాలి.