Veera Simha Reddy: మా బావ మనోభావాలు సాంగ్ పై కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. స్పెషల్ సాంగ్స్ వల్లే ఊహించని స్థాయిలో కొన్ని సినిమాల కలెక్షన్లు పెరిగాయి. వీరసింహారెడ్డి సినిమా నుంచి తాజాగా మా బావ మనోభావాలు సాంగ్ లిరికల్ వీడియో విడుదలైంది. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటలో బాలయ్యకు జోడీగా హనీ రోజ్, చంద్రికా రవి కనిపించారు. బాలయ్య అదిరిపోయే స్టెప్స్ తో ఆకట్టుకున్నారు.

వీరసింహారెడ్డి సినిమాకు బాలయ్య డ్యాన్స్ లు హైలెట్ కానున్నాయని తెలుస్తోంది. ప్రోమోతో ప్రేక్షకులకు పిచ్చెక్కించిన బాలకృష్ణ లిరికల్ వీడియోతో ఆ అంచనాలను మరింత పెంచేశారు. బాలయ్య ఎనర్జీకి ఫిదా అవుతున్నామని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. స్పెషల్ సాంగ్స్ లో ఈ సాంగ్ మరింత స్పెషల్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 225 సెకన్ల నిడివితో ఉన్న ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేలా ఉంది. థమన్ మ్యూజిక్ బాగుందని కొరియోగ్రఫీ ఈ సాంగ్ కు హైలెట్ గా నిలవనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సాంగ్ కు థియేటర్స్ లో గోల మామూలుగా ఉండదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మాస్ సాంగ్ కు బాలయ్య మాస్ స్టెప్స్ యాడ్ కాగా బాలయ్య అభిమానులకు ఈ సాంగ్ ఎంతగానో నచ్చేసింది. అఖండను మించి ఈ సినిమా ఉండబోతుందని అఖండను మించి ఈ సినిమాలో బాలయ్యను చూడబోతున్నామని ఫ్యాన్స్ చెబుతున్నారు. బాలయ్యకు ఏజ్ అనేది జస్ట్ నంబర్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఈసార్తి గట్టిగా కొడుతున్నామని నందమూరి ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. వీరసింహారెడ్డి బాలయ్య కోరుకున్న విజయాన్ని అందించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో అస్సలు రాజీ పడలేదని తెలుస్తోంది. థమన్ ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టారని సాంగ్స్ చూస్తుంటే అర్థమవుతోంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus