Priyanka Chopra: ఇండియాలో ‘అవి’ చూపిస్తే చాలు…. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌!

సోషల్‌ మీడియాలో పొగడటానికి, తిట్టడానికి ఎక్కువ గ్యాప్‌ అవసరం లేదు. అలా అని మనసుషులు మారిపోవాల్సిన అవసరమూ లేదు. జస్ట్‌ మాటలు మారిపోతే సరి. ఆటోమేటిగ్గా పువ్వులు కాస్త రాళ్లు అయిపోతాయి. దీనికి తాజా ఉదాహరణ ప్రియాంక చోప్రా అలియాస్‌ పిగ్గీ చాప్స్‌ చేసిన కామెంట్సే. ఎప్పుడో ఏడేళ్ల క్రితం ఆమె చేసిన కొన్ని కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌ అయ్యి.. ఆమెను ట్రోల్‌ చేసేలా చేస్తున్నాయి. అంతగా ఏమంది అంటే.. ఇండియన్‌ సినిమాల్లో ఏం చూస్తారు, చూపిస్తారు అనేది చెప్పింది.

ప్రియాంక చోప్రా.. ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌. చిన్నసినిమాలతో మొదలుపెట్టి.. అగ్ర తారగా మారిన ప్రియాంక ఆ తర్వాత పాన్‌ వరల్డ్‌ సినిమాలు చేసి గ్లోబల్‌ ఐకాన్‌ అయిపోయింది. అక్కడికి వెళ్లాక మన సినిమాలు చేసే సమయంలో ఆమె ఎదుర్కొన్న సమస్యలు, బాధలు చెప్పుకుంది. హాలీవుడ్‌ సినిమాలు చేసే తొలినాళ్లలో పడ్డ బాధలు కూడా చెప్పుకుంది. దీంతో ‘అయ్యో ప్రియాంకను ఇన్ని మాటలు అన్నారా?’ అంటూ ఫ్యాన్స్‌ తెగ ఇది అయిపోయారు.

అయితే ఓ ఏడేళ్ల క్రితం ఎమ్మీ అవార్డ్స్‌ సందర్భంలో (Priyanka Chopra) ప్రియాంక కొన్ని కామెంట్స్‌ చేసింది. ఇప్పుడు అవి ఎలాగో బయటకు వచ్చి వైరల్‌గా మారి ఆమెను ఇబ్బంది పెట్టే స్థాయికి వెళ్లిపోయాయి. భారతీయ సినిమాలను కించపరుస్తూ ఆమె ఆ వీడియోలో వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితికి ఆమె చేటు చేసేలా మారింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఈ అవార్డుల వేడుక జరిగింది. వేడుక అనంతరం బయకు వచ్చిన ప్రియాంకను భారతీయ సినిమాలను గురించి చెప్పాలని ఓ అంతర్జాతీయ మీడియా అడిగారు.

దానికి ఆమె భారతీయ సినిమాల్లో హిప్స్, BXXbs తప్ప ఇంకేమీ ఉండవు అనే అర్థం వచ్చేలా మాట్లాడింది. అంగాంగ ప్రదర్శన చేయడం తప్ప ఇంకేం ఉండదనే రీతిలో ఆమె అలా చెప్పింది అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. హాలీవుడ్ స్థాయికి ఎదిగిన బాలీవుడ్‌ నాయిక.. ఇలా మాట్లాడటం సరికాదని వారి అభిప్రాయం. అయితే అది ఆమె అభిప్రాయం అని ఫ్యాన్స్‌ అంటున్నారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus