స్టార్ హీరో బాలకృష్ణ (Balakrishna) స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ఈ కాంబోలో తెరకెక్కిన సింహా (Simha) , లెజెండ్ (Legend) , అఖండ (Ahanda) సినిమాలు ప్రేక్షకులను మెప్పించే విషయంలో సక్సెస్ అయ్యాయి. అయితే ఈ సినిమాలేవీ 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను అందుకోలేదు. అఖండ సినిమాకు ఆ ఛాన్స్ ఉన్నా వేర్వేరు కారణాల వల్ల పరిస్థితులు అనుకూలించలేదు. అఖండ సీక్వెల్ ఆ రికార్డ్ ను కచ్చితంగా క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
అఖండ సీక్వెల్ ఖర్చు విషయంలో మేకర్స్ సైతం రాజీ పడే అవకాశం అయితే లేదని తెలుస్తోంది. అఖండ సీక్వెల్ 2026 సంవత్సరంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మూవీలో యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం అందుతోంది.
బాలయ్య బోయపాటి శ్రీను కాంబో ఈసారి పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేయనుంది. అఖండ సీక్వెల్ కు తేజస్విని కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. తేజస్విని నిర్మాతగా వ్యవహరిస్తుండటం ఈ సినిమాకు కమర్షియల్ గా ప్లస్ కానుందని చెప్పవచ్చు. తేజస్విని నిర్మాణ రంగంలో ఊహించని స్థాయిలో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణకు తర్వాత సినిమాలు భారీ విజయాలను అందిస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. అఖండ సీక్వెల్ లో బాలయ్య లుక్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ కాకపోవడం కూడా సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. కథ, కథనం విషయంలో బోయపాటి శ్రీను జాగ్రత్తలు తీసుకుంటే అఖండ2 సృష్టించే సంచలనాలు మాత్రం మామూలుగా ఉండవు.