Viswam Review in Telugu: విశ్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • గోపీచంద్ (Hero)
  • కావ్యా థాపర్ (Heroine)
  • సునీల్, జిషు సేన్గుప్తా, మురళీ శర్మ, ఆర్య , వెన్నెల కిషోర్, నరేష్, విటివి గణేష్ తదితరులు.. (Cast)
  • శ్రీను వైట్ల (Director)
  • వేణు దోనెపూడి - టి.జి.విశ్వప్రసాద్ (Producer)
  • చేతన్ భరద్వాజ్ (Music)
  • కె.వి గృహన్ (Cinematography)
  • Release Date : అక్టోబర్ 11, 2024

ఏదైనా సినిమా హిట్ అవ్వడం చిత్ర బృందంలో ఒకరిద్దరికి కీలకం అవ్వడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. అయితే.. మొట్టమొదటిసారిగా ఓ సినిమా హిట్ అవ్వడం.. హీరో, హీరోయిన్, డైరెక్టర్ & ప్రొడ్యూసర్ ఇలా అందరికీ కీలకం అవ్వడం అనేది “విశ్వం” (Viswam) విషయంలోనే జరుగుతోంది. గోపీచంద్ (Gopichand)  హీరోగా శ్రీనువైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో కావ్య థాపర్ (Kavya Thapar)  కథానాయిక. ఈ నలుగురికీ “విశ్వం” హిట్ కొట్టడం చాలా అవసరం. మరి వారి ఆశలను “విశ్వం” ఏమేరకు నెరవేర్చిందో చూద్దాం..!!

Viswam Review in Telugu

కథ: సిటీలో వరుసబెట్టి బాంబ్ బ్లాస్టులు జరుగుతూ ఉంటాయి.. ఆ క్రమంలో జరిగిన మినిస్టర్ హత్యను చూసిన పాప ప్రాణాలు కాపాడడం కోసం గోపీ అనే పేరుతో కథలోకి ఎంటర్ అవుతాడు విశ్వం (గోపీచంద్). పాప ప్రాణాలకు ముప్పు చాలా పెద్ద స్థాయిలో ఉందని తెలుసుకొని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమెను కాపాడడం కోసం ప్రాణాలు తెగిస్తాడు. అసలు సిటీలో జరుగుతున్న బాంబ్ బ్లాస్టుల వెనుక ఉన్నది ఎవరు? విశ్వం ఆ పాపను కాపాడగలిగాడా? ఇండియాలో జరుగుతున్న టెర్రరిజంను మట్టుబెట్టగలిగాడా? వంటి ప్రశ్నలకు సమాధానమే “విశ్వం” (Viswam) చిత్రం.

నటీనటుల పనితీరు: గోపీచంద్ లుక్స్ పరంగా కాస్త కేర్ తీసుకోకపోయినా, అతడి పాత్ర మాత్రం ఎంటర్టైనింగ్ గా సాగింది. “లౌఖ్యం” (Loukyam) తర్వాత గోపీచంద్ నటుడిగా జనాల్ని ఎంటర్టైన్ చేసిన సినిమా ఇదే అని చెప్పాలి. ఎప్పట్లానే డ్యాన్స్ & యాక్షన్ బ్లాక్స్ తో మాస్ ఆడియన్స్ ను అలరించాడు. కావ్య థాపర్ పోషించిన క్యారెక్టర్ బాగున్నా.. ఆమె కనీస స్థాయిలో లిప్ సింక్ ఇవ్వలేక జస్ట్ డ్యాన్సింగ్ డాల్ లా మిగిలిపోయింది. ఇద్దరి నడుమ ఎంతో ఆకర్షణీయంగా చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్ విజువల్స్ కి పాటకి ఏమాత్రం సింక్ అవ్వలేదు.

సునీల్ (Sunil) , రాహుల్ రామకృష్ణలు (Rahul Ramakrishna) కామెడీ పండించడానికి ప్రయత్నించారు. కొంతమేరకు విజయం సాధించారు కూడా. జేషు సేన్ గుప్తా నటన కంటే అతడిని డబ్బింగ్ చెప్పిన హేమచంద్ర వాయిస్ కే ఎక్కువ మార్కులు పడతాయి. సినిమాకి చాలా క్రూషియల్ అయిన విలన్ క్యారెక్టర్ ను సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోగా, కనీస స్థాయి సన్నివేశాలు రాయకపోవడం బాధాకరం. నరేష్  (Naresh) , ప్రగతి (Pragathi), పృథ్వీరాజ్ (Prudhvi Raj), వెన్నెల కిషోర్  (Vennela Kishore)  ల కామెడీ మాత్రం బాగా వర్కవుట్ అయ్యింది.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాగా “విశ్వం” (Viswam) శ్రీనువైట్ల రీసెంట్ సినిమాతో పోల్చి చూస్తే చాలా బెటర్. నిజానికి ఇంటర్వెల్ బ్లాక్ వరకు చూసి “శ్రీనువైట్ల ఈజ్ బ్యాక్” అనిపించింది కూడా. అయితే.. అసలు సమస్య మొత్తం సెకండాఫ్ లోన్ మొదలైంది. శ్రీనువైట్ల-గోపీమోహన్ (Gopimohan) లాంటి సీనియర్ మోస్ట్ రైటర్స్ కలిసి కూడా కనీస స్థాయి సన్నివేశాలను రాసుకోలేదు, అలాగే సెకండాఫ్ స్క్రీన్ ప్లే మొత్తం మరీ పిల్లల ఆటలా ఉంటుంది. ఇక క్లైమాక్స్ ను కంగారుగా డీల్ చేసిన విధానం పెద్ద మైనస్. అప్పటివరకు కాస్తో కూస్తో సినిమా మీద ఉన్న పాజిటివిటీ మొత్తం ఆ క్లైమాక్స్ పాడు చేసింది.

దర్శకుడిగా శ్రీనువైట్ల తనలో సత్తా ఉందని ఫస్టాఫ్ తో ప్రూవ్ చేసుకున్నాడు కానీ, సెకండాఫ్ కి వచ్చేసరికి మాత్రం మిన్నకుండిపోయాడు. అయితే.. కామెడీ & యాక్షన్ బ్లాక్స్ వర్కవుట్ అవ్వడం సినిమాకి ప్లస్ పాయింట్. మరీ శ్రీనువైట్ల కమ్ బ్యాక్ ఫిలిం అని చెప్పలేం కానీ.. ఓవరాల్ గా కాస్త బెటర్ అనొచ్చు.

సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj) పనితనాన్ని మెచ్చుకోవాలి. మొండి తల్లి పాట వినసొంపుగానే కాక అర్థవంతంగా ఉంది. ఆ పాటను చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక నేపథ్య సంగీతంతో సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచాడు. కె.వి.గుహన్ (K. V. Guhan) సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ముఖ్యంగా డ్రోన్ షాట్స్ భలే ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ విషయంలో చిత్రబృందం ఎక్కడా రాజీపడలేదు. కాకపోతే.. టెర్రరిస్ట్ క్యాంప్ లో ఐకియా సామాన్లు చూసి మాత్రం కాస్త నవ్వుకుంటాం. నిర్మాతలు మాత్రం ఏమాత్రం రాజీపడలేదు.

విశ్లేషణ: శ్రీనువైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్ తో సాగిన ఫస్టాఫ్, లాజిక్ లేకుండా ముగిసిన సెకండాఫ్ “విశ్వం”ను యావరేజ్ గా నిలిపాయి. సెకండాఫ్ కాస్తంత జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే గనుక సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అయ్యేది. అయినప్పటికీ.. శ్రీనువైట్ల సినిమాల్లో “బాద్ షా” (Baadshah) తర్వాత వచ్చిన సినిమాల్లో “విశ్వం” చాలా బెటర్ అని చెప్పాలి.

ఫోకస్ పాయింట్: కచ్చితంగా శ్రీనువైట్ల నుంచి వచ్చిన బెటర్ సినిమా “విశ్వం”.

రేటింగ్: 2/5

మా నాన్న సూపర్ హీరో సినిమా రివ్యూ & రేటింగ్!

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus