ileana: ఇలియానా బిడ్డకు తండ్రి ఇతనేనా.. వైరల్ అవుతున్న ఫోటో!

సినీ నటి ఇలియానా ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైన సంగతి మనకు తెలిసిందే. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో వెలుగు వెలిగినటువంటి ఈమె అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఇలియానా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండేవారు అయితే ఉన్నఫలంగా ఈమె సోషల్ మీడియా వేదికగా తాను తల్లి కాబోతున్నానని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ విధంగా ఇలియానా తల్లి కాబోతున్నట్టు పోస్ట్ చేయడంతో ఎంతోమంది షాక్ అవ్వడమే కాకుండా అసలు పెళ్లి కాకుండా తల్లి కావడం ఏంటి ఈమె ప్రెగ్నెంట్ కి కారణమైనటువంటి ఆ వ్యక్తి ఎవరు అంటూ పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఇలియానా (ileana) కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అంటూ కూడా ఆరా తీశారు. అయితే ఇలియానా మాత్రం తన బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయాన్ని తెలియజేయకుండా తన ప్రేగ్నెన్సీ విషయాలను అందరితో పంచుకునేవారు. ఈ విధంగా ఇలియానా తన ప్రెగ్నెన్సీ సమయంలో తనకు కలిగే ఫీలింగ్స్ అలాగే బేబీ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నప్పటికీ తన బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయాన్ని మాత్రం పంచుకోలేదు అయితే గత కొద్దిరోజుల క్రితం ఈమె తన బాయ్ ఫ్రెండ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటికీ తన ఫేస్ కనపడకుండా జాగ్రత్త పడ్డారు.

అయితే ఈమె ఒకేసారి తన ప్రియుడు బిడ్డని ఇద్దరినీ పరిచయం చేయబోతున్నారని అందరూ భావించారు. ప్రస్తుతం 9 వ నెల గర్భంతో ఉన్నటువంటి ఇలియానా ఈ సమయంలో తనకు చాలా నీరసంగా ఉందని ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తెలిపారు.ఇలా తొమ్మిదవ నెలలోకి అడుగుపెట్టిన ఇలియానా మరి కొద్ది రోజులలో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.

ఈ క్రమంలోనే తన ప్రియుడితో కలిసి డిన్నర్ డేట్ కి వెళ్లినటువంటి ఈమె తన ప్రియుడుతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇలా తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసినప్పటికీ అతను ఎవరు ఏంటి అనే వివరాలను మాత్రం తెలియచేయలేదు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus