స్టార్ హీరోల సినిమాలకు ఉండే డిమాండ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాక్ తో సంబంధం లేకుండా మినిమమ్ వసూళ్లు దక్కించుకుంటాయి. ఇక బడ్జెట్ సంగతెలా ఉన్నా అధిక రేట్లకు సినిమా అమ్మేసి చేతుల దులిపేసుకోవచ్చు. సినిమా భారీ హిట్టయితే లాభాలలో వాటా పెరుగుతుంది. ఒక వేళ ప్లాప్ అయితే మార్జిన్ తో సినిమా అమ్మేస్తాడు కాబట్టి నిర్మాత సేఫ్. ఇలాంటి పరిస్థితిలో హీరోలు సైతం ట్రెండ్ మార్చారు. మొక్కుబడిగా పారితోషికం తీసుకొని సినిమా చేసే పద్ధతిని వదిలేశారు. మాకు నిర్మాణ భాగస్వామ్యం కావాలంటున్నారు. మహేష్, ప్రభాస్, బన్నీ ఇప్పటికే ఈ పద్దతిని ఫాలో అవుతుండగా కొత్తగా ఎన్టీఆర్ వచ్చి చేరినట్టు తెలుస్తుంది.
ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ తో చేయనున్న తన 30వ చిత్రంలో నిర్మాణ భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఐతే ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ ది అయినప్పటికీ తమ్ముడు ఎన్టీఆర్ కి కూడా వాటా ఒప్పందంతోనే ఈ ప్రాజెక్ట్ కి నిర్మాణ భాగస్వామిగా తీసుకున్నారని తెలుస్తున్న సమాచారం. కాబట్టి ఎన్టీఆర్ కూడా ఇతర స్టార్ హీరోల వలె పారితోషికంతో పాటు నిర్మాతగా లాభాలు కూడా కావాలంటున్నాడు. ఇక పై ఎన్టీఆర్ నటించే ప్రతి సినిమాలో నిర్మాణ బాధ్యత కూడా తీసుకోవాలని ఆయన నిర్ణయించుకుంటున్నారట. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ద్వారా లేదా, ఓ కొత్త ప్రొడక్షన్ హౌస్ స్థాపించే ఆలోచన కూడా ఆయనకు ఉందిట. మహేష్, చరణ్ లు సినిమాతో పాటు అనేక బిజినెస్ లు చేస్తుండగా ఎన్టీఆర్ కొత్తగా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
Most Recommended Video
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్