FIR Collections: ఓకె అనిపించే ఓపెనింగ్స్ ను నమోదు చేసిన ‘ఎఫ్.ఐ.ఆర్’..!

  • February 12, 2022 / 06:43 PM IST

కోలీవుడ్ లో ట్యాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విష్ణు విశాల్…’రాట్ససన్’ చిత్రంతో అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మొదటిసారి అతను ‘ఎఫ్.ఐ.ఆర్’ అనే డార్క్ యాక్షన్ థ్రిల్లర్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని… ‘విష్ణు విశాల్ స్టూడియోస్’ బ్యానర్ పై స్వయంగా హీరో విష్ణు విశాలే నిర్మించగా తెలుగులో మాత్రం మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌మ‌ర్ప‌కుడిగా వ్యవహరిస్తున్నాడు.

Click Here To Watch

‘అభిషేక్ పిక్చ‌ర్స్’ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 11న విడుదలైన ఈ చిత్రానికి పర్వాలేదు అనిపించే టాక్ నమోదైంది. దాంతో ఓ మోస్తరు ఓపెనింగ్స్ నమోదయాయ్యి.

ఫస్ట్ డే కలెక్షన్లను గమనిస్తే :

నైజాం  0.11 cr
సీడెడ్  0.08 cr
ఆంధ్రా(టోటల్)  0.15 cr
ఏపి+తెలంగాణ (టోటల్)  0.34 cr

‘ఎఫ్.ఐ.ఆర్’ మూవీకి తెలుగులో రూ.1.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. విష్ణు విశాల్ సినిమా తెలుగులో డబ్ అవ్వడం ఇదే మొదటిసారి. రానా నటించిన ‘అరణ్య’ సినిమాలో ఇతను కీ రోల్ పోషించినప్పటికీ అది జనాలకి అంతగా రిజిస్టర్ కాలేదు.అయితే ‘ఎఫ్.ఐ.ఆర్’ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.1.50 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.’ఖిలాడి’ వంటి చిత్రం పోటీగా ఉన్నప్పటికీ ‘ఎఫ్.ఐ.ఆర్’ మూవీ రూ.0.34కోట్ల షేర్ ను నమోదు చేసింది.

బ్రేక్ ఈవెన్ కు మరో రూ.1.06 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఈరోజు రిలీజ్ అయిన ‘డిజె టిల్లు’ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది కాబట్టి… ‘ఎఫ్.ఐ.ఆర్’ మూవీ కలెక్షన్ల పై ఎంత ప్రభావం చూపుతుందో తెలియాల్సి ఉంది.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus