ఆ ఫ్లాప్ దర్శకుడిని నాగార్జున కనికరించేనా..?

సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే అంత ఈజీ కాదు. అందులోనూ దర్శకులకు ఛాన్స్ లు రావాలి అంటే వాళ్ళ చేతిలో హిట్లు ఉండి తీరాలి. హిట్టు ఉంటే నిర్మాతలందరూ నెత్తిన పెట్టుకుంటారు. అయితే ప్లాపుల్లో ఉంటే మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. కనీసం ఎటువంటి వేడుకలకు పిలవరు. ఎటువంటి గౌరవం వారికి దక్కదు. నిజానికి ఇందులో తప్పేమీలేదు. డైరెక్టర్ హిట్ ఇచ్చి నిర్మాతకు డబ్బులు మిగిలేలా చూస్తేనే కదా.. అవకాశాలు ఇచ్చేది. లేక పోతే ఏ నిర్మాత అయినా డబ్బులు ఎందుకు పెడతాడు? ఇక అసలు విషయం ఏమిటంటే..

నాగార్జునతో సినిమా చెయ్యాలని ఓ ప్లాప్ దర్శకుడు.. గత కొంత కాలంగా తెగ తిరుగుతున్నాడట. అయితే ఆ దర్శకుడు ఇప్పుడు ప్లాపుల్లో ఉన్నాడట.అక్కడే వచ్చింది అసలు సమస్య. అలా అని ఆ దర్శకుడిని తక్కువ చెయ్యాల్సిన పని లేదు. గతంలో మంచి హిట్ సినిమాలు ఇచ్చాడు. నిజానికి అఖిల్ ను ఇతని డైరెక్షన్లోనే లాంచ్ చెయ్యాలి అని మొదట్లో నాగార్జున అనుకున్నారట. ఇప్పుడు జాలిపడి ఛాన్స్ ఇవ్వడానికి.. ఇటు నాగార్జున కానీ అటు అఖిల్ కానీ డేర్ చెయ్యలేని పరిస్థితి. ఎందుకంటే నాగార్జున గత సినిమాలు సరిగ్గా ఆడలేదు.

ఇక అఖిల్ ఇప్పటి వరకూ ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేదు. కాబట్టి ‘సినిమా చేస్తాను అని కానీ’.. ‘చెయ్యను అని కానీ’ నాగార్జున చెప్పలేకపోతున్నాడట. అయితే ఆ దర్శకుడు మాత్రం నాగార్జున చుట్టూనే తిరుగుతున్నాడట. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. గతంలో నాగార్జున ప్లాపుల్లో ఉన్నప్పుడు కూడా ఇతనే హిట్ ఇచ్చి ఆదుకున్నాడట. ఇక మరోపక్క నాగార్జునకు ‘సోగ్గాడే చిన్ని నాయన’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ పరిస్థితి కూడా ఇలానే ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది.

Most Recommended Video

ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus