Pawan Kalyan: పవన్ విజయంపై ఆయనకు ఇంత నమ్మకమా.. మెజారిటీ అంతంటూ?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  (Pawan Kalyan)  ఈ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో కచ్చితంగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ విజయం పక్కా ఆస్తి మొత్తం బెట్టింగ్ కడతా కడతా అంటూ టీడీపీ నేత ఎస్.వీ.ఎస్.ఎన్.వర్మ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. కనీసం 30వేల మెజారిటీతో పవన్ ఎమ్మెల్యే కావడం ఖాయమని కొంతమంది చెబుతున్నారు. పవన్ తన ఆస్తిని బెట్టింగ్ కడతా అని చెప్పడంతో గెలుపు విషయంలో వర్మకు ఇంత నమ్మకమా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

తన పందేనికి ఎవరైనా ముందుకు వస్తారా అని ఆయన సవాల్ విసరడం గమనార్హం. వర్మ సవాల్ తో పవన్ గెలుపు ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. పవన్ సైతం తన గెలుపు విషయంలో కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్ని వేల ఓట్లతో ఎన్నికల్లో గెలుస్తారో అనే చర్చ స్థానికంగా జరుగుతుండటం గమనార్హం.

పవన్ కు సపోర్ట్ చేయవద్దని తనకు భారీ ఆఫర్ వచ్చిందని అయినప్పటికీ తాను పవన్ కు మద్దతు ఇవ్వడం జరిగిందని వర్మ పేర్కొన్నారు. వర్మ ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాల తర్వాత సినిమాల షూటింగ్స్ లో ఎప్పుడు పాల్గొంటారో అనే చర్చ జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ పారితోషికం కూడా భారీ రేంజ్ లో ఉండగా పవన్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న అన్ని సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. క్రేజ్ పరంగా పవన్ కళ్యాణ్ మాత్రం టాప్ లో ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus