Hyper Aadi, Balakrishna: ‘జబర్దస్త్’ లో ట్రోల్ చేసి.. ఇప్పుడు బాలయ్య ముందు భజన స్టార్ట్ చేశాడు!

హైపర్ ఆది..! (Hyper Aadi) ‘జబర్దస్త్’ స్కిట్స్ లో ఓ సైడ్ క్యారెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ‘ఆ తర్వాత తన టాలెంట్ తో స్టార్ గా ఎదిగాడు’ అని అంతా అనుకుంటారు. ‘ప్రాసలతో కూడిన అతని నాన్ స్టాప్ పంచ్..లు భలే ఉంటాయి’ అంటూ కొందరు ఆదిని ప్రశంసిస్తూ ఉంటారు. ఇంకొంతమంది మాత్రం.. ‘సెలబ్రిటీలు పలు సందర్భాల్లో మాట్లాడిన తీరును కించపరుస్తూ స్కిట్స్ చేస్తుంటాడని, అవి ట్రోలింగ్ మెటీరియల్ గా బాగుంటాయని, అందుకే ఇతను క్లిక్ అయ్యాడని’ అంటుంటారు.

ఏదైతేనేం.. ఇతనికి వరుస సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయి. అక్కడి వరకు ఓకే. కానీ ఇతను ఏ ఈవెంట్లో కనిపించినా.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  , త్రివిక్రమ్ (Trivikram)..లకు నాన్ స్టాప్ గా భజన చేస్తూనే ఉంటాడు. బయట సినిమాల ఫంక్షన్స్ కి వెళ్లి మైక్ పట్టుకుంటే చాలు ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ భజన లేకుండా ఇతని స్పీచ్ కంప్లీట్ అవ్వదు. ఇదిలా ఉంటే.. ఈ మధ్య ఇండస్ట్రీకి చెందిన వారందరూ ‘మాకు హైపర్ ఆది భజనే కావాలన్నట్లు’ వ్యవహరిస్తున్నారు.

‘భోళా శంకర్’ (Bhola Shankar) ప్రమోషన్స్ లో హైపర్ ఆది ఏ రేంజ్లో మెగా భజన చేశాడో అందరూ చూశారు. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘రూల్స్ రంజన్’ (Rules Ranjann) ప్రమోషన్స్ లో, రవితేజ (Ravi Teja) ‘ఈగల్’ (Eagle) ప్రమోషన్స్ లో .. కూడా తన మార్క్ భజనతో హాట్ టాపిక్ అయ్యాడు హైపర్ ఆది. సరే అన్నీ ఎలా ఉన్నా.. ‘జబర్దస్త్’ స్కిట్స్ లో ఎక్కువగా హైపర్ ఆది… బాలకృష్ణ (Nandamuri Balakrishna) పై సెటైర్లు వేస్తూ స్కిట్స్ చేసేవాడు అని చాలా మంది చెబుతుంటారు. బాలయ్య ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో అతనిపై ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

అయితే నిన్న జరిగిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలయ్య గెస్ట్ గా వచ్చాడు. దీంతో హైపర్ ఆది బాలయ్యని మోసేస్తూ భజన స్టార్ట్ చేశాడు. ‘మ్యాన్షన్ హౌస్ వేస్తే ఎంత కిక్ వస్తుందో’ అంటూ మొదలుపెట్టి.. రేపొద్దున్న ‘నందమూరి నటసింహం.. కొణిదెల కొదమ సింహం కలిసి అసెంబ్లీలో అడుగు పెడితే ఎంత కిక్ వస్తుందో..

‘మా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అంత కిక్ ఇస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు హైపర్ ఆది. దీంతో కొంతమంది ‘బాలయ్యని ట్రోల్ చేస్తూ స్కిట్స్ వేసి ఇప్పుడు ఎదురుపడగానే భజన స్టార్ట్ చేశాడు భజన స్టార్ ‘ అంటూ హైపర్ ఆదిని విమర్శిస్తున్నారు నెటిజన్లు. మరికొంతమంది అయితే ‘టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో హైపర్ ఆది ఇలా బాలకృష్ణని మోసేశాడు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus