రాంచరణ్ (Ram Charan), దర్శకుడు శంకర్ (Shankar)..ల ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు. ఓపెనింగ్స్ కొంత వరకు పర్వాలేదు అనిపించినా, సంక్రాంతి సెలవులు క్యాష్ చేసుకున్నా.. టార్గెట్ వరకు రీచ్ అయ్యేంత కలెక్ట్ చేయలేదు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకి భారీ బిజినెస్ జరగడం వల్ల బాక్సాఫీస్ వద్ద స్లో అయ్యింది అని చెప్పాలి.
‘గేమ్ ఛేంజర్’ 17 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 19.37 cr |
సీడెడ్ | 10.47 cr |
ఉత్తరాంధ్ర | 10.45 cr |
ఈస్ట్ | 6.31 cr |
వెస్ట్ | 4.12 cr |
కృష్ణా | 5.33 cr |
గుంటూరు | 6.28 cr |
నెల్లూరు | 3.62 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 65.95 cr |
కర్ణాటక | 4.92 cr |
తమిళనాడు | 3.64 cr |
కేరళ | 0.26 cr |
ఓవర్సీస్ | 14.13 cr |
నార్త్ | 14.42 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 103.35 cr (షేర్) |
‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రూ.250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.255 కోట్లు షేర్ ను రాబట్టాలి. 17 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమాకు రూ.103.35 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.151.65 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.