Anveshi Jain: రామారావుతో ఆడిపాడిన గందీబాత్‌ భామ

అన్వేషి జైన్‌… ఈ భామ గురించి మనకు కొత్త కావొచ్చు. కానీ సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు బాగా ఫేమస్‌. బాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌లు చూసేవాళ్లకు అయితే, అందులోనూ కాస్త హాట్‌ కంటెంట్‌ చూసేవాళ్లకైతే ఇంకా పరిచయం. కవర్‌ సాంగ్‌లు, హాట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాను అల్లల్లాడిస్తుంటుంది. ‘గంధీ బాత్‌’ అనే వెబ్‌ సిరీస్‌తో అయితే కుర్రకారును నరాల్ని మెలి తిప్పేసింది. ఈ ‘భారీ’ అందం ఇప్పుడు టాలీవుడ్‌ను తాకుతోంది. అవును అన్వేషి జైన్‌ను తెలుగు సినిమా తెర మీద చూపించబోతున్నారట.

రవితేజ – శరత్‌ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో దివ్యాంశా కౌశిక్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ కూడా ఉందట. ఇటీవల ఆ పాటను హైదరాబాద్‌లో ఓ స్పెషల్‌ సెట్‌లో చిత్రీకరించారని సమాచారం. అందులోనే రవితేజతో అన్వేషి జైన్‌ స్టెప్పులేసిందని తెలిసింది. మామూలుగానే హాట్‌గా ఉండే అన్వేషి… ఈ పాటలో మరింత హాట్‌ స్టెప్పులేసిందని తెలుస్తోంది. వెండితెరపై ఈ పాట సెగలు పుట్టించడం ఖాయం అంటున్నారు.

రవితేజ సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్ భలేగా ఉంటాయి. గతేడాది ప్రథమార్ధంలో వచ్చిన ‘క్రాక్‌’లో ‘భూమి బద్దలు..’ పాట ఎంతటి హిట్‌ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు ‘రామారావు ఆన్ డ్యూటీ’లోనూ అలాంటి పాటే చేశారట. అయితే ఈ సారి నాటు స్టెప్పుల పని శేఖర్‌ మాస్టర్‌కు అప్పగించారని సమాచారం. ఆయన నేతృత్వంలో రవితేజ, అన్వేసి జైన్‌ అదరగొట్టారని అంటున్నారు. ఈ పాటకు సంబంధించి టీజర్‌ను త్వరలో విడుదల చేస్తారని తెలుస్తోంది.

టాలీవుడ్‌లో మళ్లీ ఐటమ్‌ సాంగ్స్‌ సందడి కనిపిస్తోంది. ఆ మధ్య కాస్త నెమ్మదించినా ‘పుష్ప’తో మళ్లీ మొదలైంది. ఆ సినిమాలో సమంత ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. ‘బంగార్రాజు’లో ఫరియా అబ్దుల్లా ఆడిపాడింది. ఇప్పుడు ‘గని’లో తమన్నా మెరిసింది. ఈ క్రమంలో ‘రామారావు ఆన్‌ డ్యూటీ’లో అన్వేసి జైన్‌ వస్తోంది. ఇంకా మరికొన్ని సినిమాలు ఇలాంటి స్పెషల్‌ సాంగ్స్‌ మీద దృష్టి పెట్టాయని అంటున్నారు. మరి ఏ నాయిక ఎప్పుడు ఐటమ్‌ భామగా మారుతుందో చూడాలి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus