గంగవ్వకు ఫ్యాన్స్ అసోసియేషన్లు, ఆర్మీలు, సేనలు పుట్టుకొచ్చాయంట తెలుసా? ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే… ఇదే చర్చ. దానికి కారణంగా బిగ్‌బాస్ హౌస్‌లో గంగవ్వ చేస్తున్న సందడి. వాళ్లు వీళ్లు అని చూడకుండా పంచ్‌ల మీద పంచ్‌లు వేస్తూ నవ్విస్తోంది. సెటైర్లతో దడదడలాడిస్తోంది. ఈ రోజు ఏకంగా బిగ్‌బాస్‌నే బుట్టలో పడేయాలని చూస్తోంది. అంతగా ఏం చేసింది అంటారా.. ఈ రోజు ఎపిసోడ్ చూడండి మీకే తెలుస్తుంది మరి. ‘ఖైదీ నెం. 151’లో మాస్ సాంగ్‌తో ఈ రోజు బిగ్‌బాస్ ఇళ్లు మొదలైంది.
మొత్తం టీమ్ సభ్యులంతా డ్యాన్స్‌లతో అదరగొట్టారు. ఆరియానా, సోహైల్‌తో మిగిలిన టీమ్ గొడవ కూడా ప్యాచప్ అయిపోయినట్లుంది. వాళ్లు కూడా డ్యాన్స్‌లు వేస్తున్నారు. ఆ డ్యాన్స్‌ల మధ్య గంగవ్వ ఏకంగా జిమ్‌లోకి వెళ్లింది. రెండు డంబెల్స్ తీసుకొని ఎక్సర్‌సైజ్ చేయబట్టింది. అక్కడితో ఆగితే బాగుండు. అభిజిత్‌కు సవాలు చేసేలా కంటిన్యూ చేసింది. ఎక్సర్‌సైజ్ అయిపోయాక ‘బిగ్‌బాస్’ అంటూ ముద్దులు కూడా ఇచ్చేసింది. దానికి కారణం నోయల్. అతను చెబితేనే గంగవ్వ ఫ్లయింగ్ కిస్‌లు విసిరింది.
కెమెరా ముందు నిలబడి ఏదో మాట్లాడింది. ఆ తర్వాత ‘నీ దగ్గరున్న చీరలన్నీ ఇచ్చేయమని బిగ్‌బాస్ చెబుతున్నాడు’ అని హారిక అంది. దానికి గంగవ్వ తనదైన స్టయిల్‌లో పంచ్ వేసింది. పంచ్ అంటే పెద్ద డైలాగ్ అనుకునేరు. ‘ఎందుకిస్తా’ అంటూ సింగిల్ లైనర్‌తో ఇచ్చి పడేసింది. ఆమె డైలాగ్ ఎంత సూపరో… దానికి హారిక రియాక్షన్ ఇంకా సూపర్.
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?
Read Today's Latest
Featured Stories Update. Get
Filmy News LIVE Updates on FilmyFocus