బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!

స్కూల్‌లో తొలి రోజు ఏం జరుగుతుంది, కొత్త ఉద్యోగంలో చేరిన తొలి రోజు ఆఫీసులో ఏమవుతుంది వీటికి ఎలాంటి సమాధానం వస్తుందో బిగ్‌బాస్‌ 4లో తొలి రోజు ఏం జరిగింది అని అడిగితే అలాంటి సమాధానమే వస్తుంది. ఈ సీజన్‌ ఎలా ఉండబోతోందో తొలి రోజే తెలిసిపోయింది. అంతలా మాస్‌ మసాలా ఫ్లేవర్‌ను యాడ్‌ చేసేశారు. నామినేషన్‌ డే కావడంతో తొలి రోజు మాంచి రంజుగా సాగింది. నామినేషన్‌ ప్రక్రియలో 14 మంది నిలిచి ఏడుగురు నామినేట్ అయ్యారు. ఇక మిగిలిన విషయాలు చూస్తే.. అదేనండి తొలి ఎపిసోడ్‌ (07/09/20) హైలైట్స్‌ ఏంటంటే?

* ప్రతి సీజన్‌ ఈ సీజన్‌లో కూడా ఉదయాన్నే హుషారైన పాటతో మొదలుపెట్టారు. ‘సాహో’లోని ‘సైకో సయ్యా…’ పాటకు టీమ్‌ మొత్తం డ్యాన్సులతో అదరగొట్టారు. అందరిలో గంగవ్వ డబుల్‌ హైలైట్‌.

* ఉదయాన్నే ఈ ఎక్సర్‌సైజ్‌లు చేయండంటూ సూర్యకిరణ్‌ కొన్ని ప్రత్యేకమైన ఎక్సర్‌సైజ్‌లు చేసి చూపించాడు. వాటిని రేపటి నుంచి ఎంతమంది చేస్తారో చూడాలి.

* నైబర్‌ హౌస్‌లో సోహైల్‌ స్టెప్పులతో అరగొట్టగా, ఆరియానా హాట్‌ మూమెంట్స్‌తో పిచ్చెక్కించింది. ఆరియానాను వీపు మీద ఎక్కించుకుని ఎక్సర్‌సైజ్‌లు చేశాడు కూడా.

* దేవి నాగవల్లి తదితరులతో అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ డ్యాన్స్‌లు చేయించాడు. కొత్త స్టెప్పులు కూడా చేసి చూపించాడు. డ్యాన్స్‌ మాస్టర్‌ కదా… రోజూ ఇలాంటివి చేయిస్తాడేమో.

* ప్రోమోలో చూపించిన ఎలుక – పిల్లి జోక్‌ పూర్తిగా చూపించారు. అదేనండి ఇంట్లో ఉన్న ఎలుకలు.. కరాటే కళ్యాణి క్యాట్‌ వాక్‌ చూసి పారిపోయాయి అంటూ సూర్య కిరణ్‌, అమ్మ రాజశేఖర్‌ నవ్వించారు. వీకెండ్‌ ఎపిసోడ్‌లో దీనిపై చర్చ నడిచేలా ఉంది.

* మార్నింగ్‌ మస్తీ పేరుతో బిగ్‌బాస్‌ ఓ టాస్క్‌ కూడా పెట్టేశాడు. ఇదేదో ఉదయాన్నే ఎమోషనల్‌ పర్సన్స్‌తో ఏడిపించే కార్యక్రమం అనిపించింది. మోనాల్‌ తన ఇంటి గురించి, కుటుంబసభ్యుల గురించి చెబుతూ ఏడ్చేసింది. మెహబూబ్‌ కూడా అంతే. ఇంకా ఒక్కరోజే బతికి ఉంటే నువ్వేం చేస్తావ్‌ అంటూ అడిగిన ప్రశ్నకు ‘నన్ను ఇన్నాళ్లూ ఎంతో బాగా చూసుకున్న నా తల్లి దండ్రులతో ఉంటా’ అంటూ గుండెలు పిండేశాడు.

* ఈ టాస్క్‌ సమయంలో మోనాల్‌ ఏడుపును కంట్రోల్‌ చేయడానికి, ఆమె టాస్క్‌లో చెప్పింది చేయడం లేదు అని చెబుతా సూర్యకిరణ్‌ మధ్యలో మాట్లాడాడు. దీంతో సూర్యకిరణ్‌- అబిజిత్‌ మధ్య చిన్న మాటల యుద్ధం జరిగింది. అది కాస్త పెరిగి పెద్దదవుతుందనే సరికి ఇద్దరూ ఆపేశారు. అయితే నామినేషన్‌ సమయంలో ఆ విషయం చర్చకు వచ్చింది. అదే సూర్యకిరణ్‌ నామినేషన్‌కు దారి తీసింది.

* మార్నింగ్‌ మస్తీ పూర్తయిపోయిన తర్వాత నైబర్‌ హౌస్‌లో ఉన్న సోహైల్‌ – ఆరియానా బిగ్‌బాస్‌ హౌస్‌కి ఫోన్‌ చేశారు. మీరు వంట వండి మాకు పంపండి, మీకు వచ్చిన నిత్యావసరాలు మాకు ఇవ్వండి అంటూ ఓ పెద్ద లిస్ట్‌ చెప్పారు. అదేదో బిగ్‌ బాస్‌ ఆర్డర్‌ అనుకుంటూ ఫోన్‌ ఎత్తిన సుజాత కంగారుపడింది. దానిపై చర్చ జరిగి, పెరిగి పెద్దదై కళ్యాణి – సుజాత మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత నామినేషన్‌లో అదే సెంట్రల్‌ టాపిక్‌ అయిన విషయమూ తెలిసిందే.

* నైబర్‌ హౌస్‌ కాల్‌ను నోయల్‌ డీకోడ్‌ చేసినట్లు కనిపించింది. ఆ కాల్‌లో ఎవరో అమ్మాయి మాటలు వినిపించాయి అంటూ మొదలుపెట్టాడు. అయితే ఎవరూ దానిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే అవ్వొచ్చులే అనుకున్నారు.

* నామినేషన్‌ ప్రక్రియ అయిన తర్వాత జరిగిన మొత్తం వ్యవహారాన్ని క్లియర్‌ చేసుకోవడానికి సుజాత్‌ … కళ్యాణిని కలిసింది. అయితే కళ్యాణి మాటలు వినకుండా అరుస్తూ వెళ్లి.. ఏడ్చేసింది. ఆ తర్వాత పోస్టల్‌లో మరో కవర్‌ వచ్చింది.

* మీ 14 మందిలో ఓ కట్టప్ప ఉన్నాడంటూ బిగ్‌బాస్‌ తొలి ఎపిసోడ్‌కి ఎండింగ్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు. అదెవరు.. బిగ్‌బాస్‌ ఏం చెప్పాలనుకుంటున్నాడనేది రెండో రోజు ఎపిసోడ్‌లో చూడొచ్చు. ఎలాగూ ప్రోమోలు వస్తాయి కాబట్టి కొంచెం క్లారిటీ కూడా వచ్చేస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus