Allu Arjun, Aditi Aggarwal: గంగోత్రి రోజులు గుర్తుకొస్తున్నాయంటూ ఎమోషనల్ అయిన అదితి అగర్వాల్!

  • August 21, 2022 / 05:38 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐ కాన్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి నటుడు అల్లు అర్జున్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. పుష్ప సినిమాతో ఏకంగా ఈయన పాన్ ఇండియా స్టార్ గా మారిపోయి ప్రస్తుతం నార్త్ లో కూడా పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈయన నటించిన పుష్ప సినిమా సీక్వెల్ చిత్రం షూటింగ్ ప్రారంభం జరుపుకోవడానికి మరి కాస్త ఆలస్యం కావడంతో ఈయన తన ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్ వెకేషన్ వెళ్లారు.

ఈ క్రమంలోనే అల్లు స్నేహారెడ్డి తన న్యూయార్క్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. ఇదిలా ఉందిగా బన్నీ న్యూయార్క్ వెకేషన్ లో భాగంగా తన మొదటి హీరోయిన్ అదితి అగర్వాల్ ను కలుసుకోవడం జరిగింది.ఈ క్రమంలోనే ఆదితి అగర్వాల్ బన్నీతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన మొట్టమొదటి చిత్రం గంగోత్రి.

ఈ సినిమాలో హీరోయిన్ గా నటి ఆర్తి అగర్వాల్ సోదరి ఆదితి అగర్వాల్ నటించారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి హిట్ అందుకున్న ఈ ఇద్దరు ఇండస్ట్రీలో అనంతరం తదుపరి అవకాశాలను అందుకున్నారు.అల్లు అర్జున్ మాత్రం వరుస సినిమాలు హిట్ కావడంతో ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగగా, ఈమె మాత్రం ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొని పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైన ఈమె విదేశాలలో స్థిరపడ్డారని తెలుస్తోంది.

అయితే తాజాగా న్యూయార్క్ లో అల్లు అర్జున్ కలిసిన ఈమె తనతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.ఇలా వీరిద్దరూ బ్లాక్ అవుట్ ఫిట్ లో ఉన్నటువంటి ఫోటోలను ఈమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ 18 సంవత్సరాల తర్వాత మొదటిసారి అల్లు అర్జున్ కలవడం జరిగింది అంటూ చెప్పుకొచ్చారు. తనే నా బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ కో యాక్టర్, బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ తన గురించి చెబుతూ ఎమోషనల్ అవ్వడమే కాకుండా గంగోత్రి రోజులు గుర్తుకు వస్తున్నాయి అంటూ ఈ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus