సింగిల్ కట్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకొన్న శాతకర్ణి!

  • January 5, 2017 / 02:06 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ “గౌతమీపుత్ర శాతకర్ణి” నేడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. శాతవాహన మహారాజు “శాతకర్ణి” జీవితం ఆధారంగా క్రిష్ తెరకెక్కించిన హిస్టారికల్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై బిబో శ్రీనివాస్ సమర్పణలో వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు నిర్మించారు. బాలకృష్ణ సరసన శ్రేయ “వశిష్ట మహాదేవి”గా ముఖ్యభూమిక పోషించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటీమణి హేమమాలిని శాతకర్ణుడి వీరమాత “గౌతమి”గా ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. జనవరి 5న “గౌతమీపుత్ర శాతకర్ణి” చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు సింగిల్ కట్ కూడా లేకుండా “యు/ఎ” సెర్టిఫికేట్ ఇచ్చారు. శాలివాహన శకం నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని క్రిష్ ఓ దృశ్యకావ్యంలా తెరకెక్కించారని, సినిమా చూస్తున్నంతసేపు గౌతమిపుత్ర శాతకర్ణుడిగా నందమూరి నటసింహం బాలకృష్ణ నటన అద్భుతంగా ఉందని సెన్సార్ సభ్యులు క్రిష్ అండ్ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ.. “మా శాతకర్ణి సెన్సార్ పూర్తయ్యింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు “సినిమా అద్భుతంగా ఉంది” అంటూ అభినందనలు తెలపడంతోపాటు.. బాలకృష్ణ నటవిశ్వరూపం, భారీ వ్యయంతో తెరకెక్కించిన యుద్ధ సన్నివేశాలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న “గౌతమిపుత్ర శాతకర్ణి” ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నందమూరి అభిమానులనే కాక యావత్ తెలుగు సినిమా అభిమానులను విశేషంగా అలరించడం ఖాయం” అన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus