Geetu: బ్యాటరీ ఛార్జింగ్ టాస్క్ లో మాటలు మార్చేసిన గీతు..! టాస్క్ లో ఏం జరిగిందంటే.?

  • October 13, 2022 / 11:44 AM IST

బిగ్ బాస్ హౌస్ లో బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ వారి కుటుంబ సభ్యుల నుంచీ ఆడియోకాల్, లేదా వీడియోమెసేజ్, వీడియో కాల్ , ఫుడ్ వీటిలో ఒకటి ఎంచుకుంటున్నారు. దీనికోసం బ్యాటరీ పర్సెంటేజ్ ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ శ్రీహాన్ ఫుడ్ ని, ఆదిరెడ్డి వీడియోకాల్ ని, సుదీప ఆడియోకాల్ ని, గీతు ఆడియోకాల్ ని, బాలాదిత్య ఆడియోకాల్ ని, ఇనయ ఫోటో ఫ్రేమ్ ని, శ్రీసత్య వీడియోకాల్ ని, అర్జున్ వీడియో మెసేజ్ ని ఎంచుకున్నారు.

వీల్ల కుటుంబసభ్యుల నుంచీ వచ్చిన మెసేజస్ ని తోటి హౌస్ మేట్స్ సైతం ఎంజాయ్ చేశారు. అయితే, ఇంట్లో రెండుసార్లు నిద్రపోయిన కారణంగా కెప్టెన్ రేవంత్ వల్ల 10శాతం బ్యాటరీ ఖర్చు అయిపోయింది. అలాగే గీతు వల్ల 5శాతం బ్యాటరీ పోయింది. దీంతో హౌస్ మేట్స్ తిరిగి రీఛార్జ్ కోసం కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది. గీతుని కన్ఫెషన్ రూమ్ కి పిలిచిన బిగ్ బాస్ బ్యాటరీ 90 పర్సెంట్ కావాలంటే బాలాదిత్య స్మోకింగ్ మానేయాలని చెప్పాడు. లేదా , హౌస్ లో ఉన్న పంచదార మొత్త స్టోర్ రూమ్ లో పెట్టాలని అన్నాడు.

నిజానికి హౌస్ లో పంచదార అనేది సింపుల్ గా చేయచ్చు. కానీ, ఇక్కడే గీతు మైండ్ గేమ్ ఆడింది. కన్ఫెషన్ రూమ్ నుంచీ బయటకి వచ్చి గీతు హౌస్ లో టాస్క్ అయ్యేవరకూ హౌస్ మేట్స్ ఏమీ తినకూడదని, పంచదార హౌస్ లో ఉన్న ఫుడ్ మొత్తం స్టోర్ రూమ్ లో పెట్టేయాలని చెప్పింది. లేదా, బాలాదిత్య స్మోకింగ్ మానేయాలని అన్నది. ఈరెండు ఆప్షన్స్ లో గంటలోగా ఏదైనా ఎంచుకుంటే బిగ్ బాస్ బ్యాటరీని రీఛార్జ్ చేస్తాడని చెప్పింది. దీంతో బాలాదిత్య ఆఖరిసారిగా సిగరెట్ తాగేసి పాకెట్స్ మొత్తం ఇచ్చేశాడు. సిగిరెట్స్ తాగకుండా చూసే బాధ్యత కెప్టెన్ రేవంత్ దే అని బిగ్ బాస్ చెప్పాడు.

దీంతో బాలాదిత్య సిన్సియర్ గా తన దగ్గరు దాచుకున్న ప్యాకెట్స్ అన్నీ ఇచ్చేశాడు. నిజానికి బాలాదిత్య స్మోకింగ్ మానేయాలన్న ఉద్దేశ్యంతోనే గీతు బిగ్ బాస్ మాటలని మార్చి చెప్పింది. ఇదే విషయాన్ని ఆదిరెడ్డికి చెప్పింది. కన్ఫెషన్ రూమ్ లో బిగ్ బాస్ అలా చెప్పలేదని, నేనే మార్చి చెప్పానని అన్నది. ఇక ఈటాస్క్ లో తన మైండ్ గేమ్ ని మరోసారి చూపించింది గీతు. బాలాదిత్య స్మోకింగ్ మానేయడంతో బిగ్ బాస్ హౌస్ లో బ్యాటరీ తిరిగి రీఛార్జ్ అయ్యింది. ఆ తర్వాత బాలాదిత్య తన భార్య మానస నుంచీ వచ్చిన ఆడియోకాల్ లో కూడా మాట్లాడాడు. అదీ విషయం.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus