Genelia, Riteish: డాన్స్ షోకి జడ్జిలుగా రితేష్, జెనీలియా కపుల్!

Advertisement

బాలీవుడ్ లో ప్రసారమవుతున్న డాన్స్ రియాలిటీ షో ‘సూపర్ డాన్సర్ 4’కి జడ్జిగా వ్యవహరిస్తున్నారు నటి శిల్పాశెట్టి. అయితే కొన్ని రోజులుగా ఆమె ఈ షోలో కనిపించడం లేదు. ఆమె భర్త, ప్రముఖ వ్యాపారవేత్త అనురాగ్ కశ్యప్ ను పోర్నోగ్రఫీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుండి శిల్పాశెట్టి యాక్టివ్ గా లేదు. డాన్స్ షోలో కూడా కనిపించడం లేదు. రీసెంట్ గా కరీష్మా కపూర్ ఈ షోలో జడ్జిగా కనిపించగా.. ఆమెని శిల్పా స్థానంలో తీసుకున్నారని అనుకున్నారు.

కానీ ఆమె కేవలం గెస్ట్ గా వచ్చారంతే. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. జెనీలియా, రితేష్ దంపతులను ఈ షోకి జడ్జిలుగా తీసుకొస్తున్నారట. గీతాకపూర్, అనురాగ్ బసులతో కలిసి ఈ స్టార్ కపుల్ షోకి జడ్జిలుగా ఉంటారని టాక్. పర్మనెంట్ గా ఈ షో నుండి శిల్పాను తప్పించాలనుకుంటున్నారని.. అందుకే జెనీలియా, రితేష్ లను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. అయితే ఈ జంట మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

బాలీవుడ్ లో రితేష్, జెనీలియాలకు మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి చేసే అల్లరిని ఫ్యాన్స్ బాగా ఇష్టపడుతుంటారు. ఎప్పటికప్పుడు వీరికి సంబంధించిన ఫన్నీ వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. ఈ క్రేజ్ ను డ్యాన్స్ షో క్యాష్ చేసుకోవాలనుకుంటుంది. ఇక త్వరలోనే జెనీలియా తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతుందంటూ వార్తలు వస్తున్నాయి.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news