మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గని’. ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్ ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. ‘దబాంగ్3’ లో ఆల్రెడీ ఈమె నటించిన సంగతి తెలిసిందే. తెలుగులో మాత్రం ఇదే ఈమెకి స్ట్రైట్ మూవీ. అల్లు బాబీ, సిద్దు ముద్ద కలిసి ఈ చిత్రాన్ని వరుణ్ తేజ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మించారు.
ఏప్రిల్ 8న ‘గని’ విడుదల కాబోతుంది. ట్రైలర్లో పాత సినిమాల పోలికలు కనిపిస్తున్నప్పటికీ వరుణ్ తేజ్ మూవీస్ కొత్త పంథాలో ఉంటాయి కాబట్టి, పాటలు కూడా హిట్ అయ్యాయి కాబట్టి ఈ మూవీ పై అంచనాలు నెలకొన్నాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ల జోరుని కూడా పెంచారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇందులో భాగంగా హీరోయిన్ సాయి మంజ్రేకర్ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా గురించి ఆ చిత్రం హీరోలైన చరణ్, ఎన్టీఆర్ ల గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఆమె మాట్లాడుతూ.. ” టాలీవుడ్లో అల్లు అర్జున్, పవన్, రాంచరణ్ నాకు ఇష్టమైన హీరోలు. తెలుగు సినిమాలు హిందీ డబ్బింగ్ లో చూస్తాను. రాంచరణ్ నటించిన `మగధీర` నాకు ఎంతో బాగా నచ్చింది, అలాగే బన్నీ నటించిన `పుష్ప` చూసి ఫిదా అయిపోయాను. ఇక పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోయాను. `వకీల్‌సాబ్` చూసి నేను బాగా ఎంజాయ్ చేశాను. టాలీవుడ్ పై నాకు మంచి రెస్పెక్ట్ ఉంది.రీసెంట్ గా ఆర్.ఆర్.ఆర్ సినిమా చూశాను.
ఈ మూవీలో ‘నాటు నాటు’ సాంగ్‌లో రాంచరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్ చూసి భయపడిపోయాను. ఆ ఒక్క పాటతోనే ఇద్దరు హీరోలకు పెద్ద ఫ్యాన్ అయ్యాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ‘గని’ తర్వాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న ‘మేజర్’ చిత్రంలో కూడా ఈమె నటిస్తోంది. ఈ మూవీ పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!