మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ నిన్న అనగా అక్టోబర్ 5న విజయదశమి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. కొణిదెల సురేఖ సమర్పణలో ‘కొణిదెల ప్రొడక్షన్స్’, ‘సూపర్ గుడ్ ఫిలింస్’ బ్యానర్ లపై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఫస్ట్ డే ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోయినా పర్వాలేదు అనిపించాయి. మొదటి వారం ఈ చిత్రం ఓకే అనిపించింది కానీ బ్రేక్ ఈవెన్ కు ఇంకా చాలా రాణించాలి. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 11.55 cr |
సీడెడ్ | 8.88 cr |
ఉత్తరాంధ్ర | 5.24 cr |
ఈస్ట్ | 3.37 cr |
వెస్ట్ | 2.00 cr |
గుంటూరు | 3.67 cr |
కృష్ణా | 2.39 cr |
నెల్లూరు | 1.84 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 38.94 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.48 cr |
హిందీ | 4.62 cr |
ఓవర్సీస్ | 4.75 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 52.79 cr (షేర్) |
‘గాడ్ ఫాదర్’ చిత్రానికి అన్ని వెర్షన్లు కలుపుకుని కు రూ.91.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.92 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.52.79 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి రూ.39.21 కోట్ల షేర్ ను రాబట్టాలి.
ఇప్పుడు పెద్ద సినిమాలు ఏవీ లేవు కాబట్టి.. లాంగ్ రన్ నిలబడగలిగితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయి. కానీ వీక్ డేస్ లో ఈ మూవీ సో సో గానే పెర్ఫార్మ్ చేస్తుంది.
Most Recommended Video
ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!