Godfather: గాడ్ ఫాదర్ సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా?

  • October 14, 2022 / 12:36 AM IST

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన నటించిన ఖైదీ నెంబర్ 150, సైరా సినిమాలో పర్వాలేదు అనిపించినా ఆచార్య సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలోనే ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు గాడ్ ఫాదర్ సినిమా ద్వారా చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇకపోతే ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా విడుదలై భారీ హిట్ అందుకోవడంతో మెగా అభిమానుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.ఇక ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారనే విషయం మనకు తెలిసిందే. ఈ సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా తమన్ మాట్లాడుతూ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ క్రమంలోనే తమన్ మాట్లాడుతూ చిరంజీవి గారు నటించిన ఈ సినిమాకు ముందుగా గాడ్ ఫాదర్ అనే టైటిల్ అనుకోలేదని ఈ సినిమాకు సర్వంతర్యామి అనే టైటిల్ ఎంపిక చేసిన విషయాన్ని వెల్లడించారు. అయితే సర్వంతర్యామి అనే టైటిల్ కన్నా గాడ్ ఫాదర్ మరింత బెటర్ గా ఉండడంతో ఈ టైటిల్ ఫిక్స్ చేశారని తమన్ వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమా కోసం గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను తమన్ ఎంపిక చేశారని ఇదివరకే సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ పేర్కొన్న విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను తమన్ఎంపిక చేశారని అయితే ఈ టైటిల్ అందరికీ నచ్చడంతో చివరికి ఇదే ఫిక్స్ చేశారని గతంలో అనంత శ్రీరామ్ కూడా ఈ సినిమా టైటిల్ విషయంపై స్పందించారు.ఇక ప్రస్తుతం తమన్ కూడా ఈ సినిమా టైటిల్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus