‘గోదా’ తెలుగు హక్కులు సొంతం చెసుకొన్న కొంకా ప్రొడక్షన్స్

గతేడాది మళయాలంలో స్పొర్ట్స్ కామెడీగా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం ‘గోదా’.టవీనొ థామస్ ,వామికా గబ్బి, ప్రముఖ రచయిత రెంజీ పనికర్ నటించిన ఈ చిత్రానికి బసిల్ జోసఫ్ దర్శకత్వం వహించారు .2017 లొ మాలీవుడ్ లొ చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. బాలీవుడ్లొ సైతం ఈ సినిమాను రీమెక్ చెసెందుకు బారీ నిర్మాణ సంస్థలు సిద్దమవుతున్నాయి. అయితే తెలుగులొ కొంకా ప్రొడక్షన్స్ సంస్థ గొదా తెలుగు డబ్బింగ్ మరియు రీమేక్ రైట్స్ ను సొంత చెసుకొంది.

తెలుగు రైట్స్ కొసం ఎంతొమంది పొటీ పడగా , నిర్మాత సంతోష్ కొంకా ఫ్యాన్సీ ఆఫర్ తో గోదా చిత్ర రైట్స్ ను సొంతం చెసుకున్నట్లు తెలియచెశారు. ప్రస్తుతం తెలుగు రీమేక్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోందని తెలుగులో నటించె ఆర్టిస్ట్లు , టెక్నిషియెన్స్ వివరాలను త్వరలొనె వెల్లడిస్తామని సంస్థ ఎగ్జిక్యూటివ్ రాజీవ్ కె.రామ తెలిపారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus