Balakrishna: నందమూరి అభిమానులకు శుభవార్త చెప్పిన బాలయ్య!

బాలయ్య గతేడాది అఖండ సినిమా సక్సెస్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారనే సంగతి తెలిసిందే. అఖండ సక్సెస్ తర్వాత దర్శకుల ఎంపిక విషయంలో బాలయ్య ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తుండగా బాలయ్య తర్వాత సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు అనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు డైరెక్టర్లు ప్రస్తుతం సక్సెస్ లోనే ఉన్నారు. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతుండగా ఈ సినిమాకు వేర్వేరు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి.

Click Here To Watch NOW

అయితే ఉగాది పండుగ కానుకగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కానుందని ఫస్ట్ గ్లింప్స్ తో పాటు టైటిల్ ను కూడా ప్రకటిస్తారని సమాచారం అందుతోంది. బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో శృతి హాసన్ నటిస్తున్నారు. అఖండకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో కూడా బాలయ్య తనకు అచ్చొచ్చిన డ్యూయల్ రోల్ లోనే కనిపిస్తారని సమాచారం అందుతోంది.

ఫస్ట్ గ్లింప్స్ కు సంబంధించి అతి త్వరలో అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఉగాది రోజున బాలయ్య అభిమానులకు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో చూడాల్సి ఉంది. వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా గోపీచంద్ మలినేని ఈ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

నందమూరి బాలయ్య ఈ ఏడాది మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారేమో చూడాలి. బాలయ్య అనిల్ కాంబో మూవీ కూడా ఈ ఏడాదే పట్టాలెక్కనుందని తెలుస్తోంది. బాలయ్య కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు వెలువడాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus