Krithi Shetty: హీరోయిన్ కృతి శెట్టి విషయంలో కన్ఫ్యూజ్ చేస్తున్న గూగుల్..!

  • March 30, 2021 / 06:05 PM IST

‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ కృతి శెట్టి. నిజానికి ఆమె సొంత పేరుతో కన్నా.. సినిమాలోని క్యారెక్టర్ పేరు అయిన బేబమ్మగానే ఎక్కువ ఫేమస్ అయ్యింది. ఈ చిత్రం నుండీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైనప్పటి నుండీ కృతి శెట్టి పై కుర్ర కారు ఫోకస్ పడింది. టీజర్, ట్రైలర్ లలో ఆమె పలికించిన హావభావాల గురించి ఎంత చెప్పినా తక్కువే. చెప్పాలంటే వాటిని బట్టే ఈ చిత్రాన్ని చూడడానికి కుర్రకారు ఎగబడి థియేటర్లకు వచ్చారని చెప్పొచ్చు. మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌ కంటే కూడా బేబమ్మకే ప్రేక్షకులు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యారు.

దర్శకుడు బుచ్చిబాబు ఆ రేంజ్లో ఆమె పాత్రను తీర్చిదిద్దాడు. ఈ చిత్రం తర్వాత ఈమె పారితోషికం పది రెట్లు పెరిగింది. ప్రస్తుతం ఈ అమ్మడు నాని హీరోగా నటిస్తున్న ‘శ్యామ్‌ సింగరాయ్‌’ అలాగే సుధీర్‌బాబు-ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాదు రామ్‌- లింగుస్వామి కాంబినేషన్లో రూపొందుతోన్న బై లింగ్యువల్ మూవీలో కూడా మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవుడ్లో ఇంత బిజీగా ఉన్న ఈ అమ్మడి గురించి గూగుల్ మాత్రం కనిపెట్టలేకపోతుంది.

విషయం ఏమిటంటే.. గూగుల్ లో కృతి శెట్టి గురించి సెర్చ్ చేస్తుంటే.. ఈమె పేరు అద్వైతగా చూపిస్తుంది. అంతేకాదు ఈమెకు బదులుగా మరో హీరోయిన్‌ ప్రోఫైల్‌ కనిపిస్తుండడం గమనార్హం. పైగా అద్వైత తమిళ సినిమాల్లో నటించినట్లు కనిపిస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయం. కృతి శెట్టి పేరుతో ప్రొఫైల్ క్రియేట్ అయినప్పటికీ.. ఆమె పేరుతో సెర్చ్ చేస్తే మాత్రం రెండు ప్రొఫైల్స్‌, రెండు ఫోటోలు దర్శనమిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.

 

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus