Gopichand: గోపీచంద్ శ్రీనువైట్ల కాంబో మూవీకి టైటిల్ ఇదేనా?

  • February 7, 2024 / 05:35 PM IST

స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్లకు గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదనే సంగతి తెలిసిందే. గోపీచంద్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో ప్రస్తుతం ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు విశ్వం అనే టైటిల్ ఫిక్స్ అయిందని భోగట్టా. సాధారణంగా గోపీచంద్ సినిమాల టైటిల్ లో సున్నా కచ్చితంగా ఉంటుంది. మెజారిటీ సినిమాల టైటిల్స్ విషయంలో గోపీచంద్ ఈ సెంటిమెంట్ ను ఫాలో అయ్యారు. ఈ సెంటిమెంట్ ప్రకారం విశ్వం హిట్ గా నిలుస్తుందేమో చూడాలి.

గోపీచంద్ కు జోడీగా కావ్య థాపర్ నటిస్తుండగా ఈగల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఈ విషయాలను వెల్లడించడం జరిగింది. సినిమాకు విశ్వం అనే టైటిల్ ఫిక్స్ అయిందని ఆమె చెప్పడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. గోపీచంద్ ఈ సినిమాకు 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. సినిమా సినిమాకు గోపీచంద్ మార్కెట్ పెరుగుతోంది.

జయాపజయాలతో సంబంధం లేకుండా గోపీచంద్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. గోపీచంద్ కు ప్రస్తుతం కెరీర్ పరంగా భారీ హిట్ అవసరమని చెప్పవచ్చు. గోపీచంద్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారని తెలుస్తోంది. మరోవైపు గోపీచంద్ నటించిన భీమా సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. మార్చి 8న ఈ సినిమా రిలీజ్ కానుంది.

గోపీచంద్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే (Gopichand) గోపీచంద్ కు కెరీర్ పరంగా తిరుగుండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంతో పోల్చి చూస్తే గోపీచంద్ సక్సెస్ రేట్ కూడా తగ్గింది. గోపీచంద్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. గోపీచంద్ కటౌట్ కు తగిన సినిమాలు రావాలని ఆ సినిమాలతో భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus