Balakrishna: బాలయ్య గోపీచంద్ మూవీ టైటిల్ ఇదేనా?

  • September 14, 2021 / 06:40 PM IST

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ వరుసగా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజయ్యే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అఖండ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా వచ్చే నెల నుంచి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ మూవీ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాకు రౌడీయిజం అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతుండగా ఈ సినిమాలో బాలకృష్ణ మూడు విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తారని సమాచారం.

ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్లు ఉంటాయని తెలుస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. రౌడీయిజం టైటిల్ బాగుందని బాలకృష్ణ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా త్రిష లేదా ఇలియానా నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అక్టోబర్ 1వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఎక్కువగా ఉంటాయని

ఈ సినిమాతో బాలయ్య కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య నటిస్తున్న అఖండ సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం గమనార్హం. అఖండ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది. అఖండ మూవీ 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus