గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రవితేజ.. మరో హిట్ గ్యారెంటీ!

  • July 11, 2023 / 09:00 AM IST

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సెంటిమెంట్లు ఉంటాయి. ఇలా సెంటిమెంట్లను ఫాలో అవుతూ సినిమాలు కనుక చేస్తే తప్పకుండా ఆ సినిమా సక్సెస్ అవుతుందని చాలా మంది భావిస్తుంటారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ సినిమాల టైటిల్ లో సింహ అని ఉంటే సినిమా హిట్ అవుతుందని చాలామంది భావిస్తారు అలాగే కొంతమంది డైరెక్షన్లో కొందరి హీరోలు సినిమా చూస్తే హిట్ అని కూడా సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు. ఇలాంటి సెంటిమెంట్ కాంబినేషనే రవితేజ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ ఒకటని చెప్పాలి.

డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ ఇప్పటివరకు మూడు సినిమాల్లో నటించారు. ఈ మూడు సినిమాల్లో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. అయితే నాలుగో సారి కూడా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందంటూ మేకర్స్ ఈ సినిమాని అధికారకంగా వెల్లడించారు. ఇప్పటికే రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

వీరిద్దరి కాంబినేషన్లో డాన్ శీను, బలుపు క్రాక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక నాలుగో సారి కూడా వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ కాబోతుందని ప్రకటించడంతో మరోసారి కూడా ఈ కాంబినేషన్లో రాబోయే సినిమా హిట్ అనే సెంటిమెంట్ అందరిలోనూ ఏర్పడింది. ఇక ఈ సినిమాని అధికారకంగా ప్రకటిస్తూ చేసినటువంటి పోస్టర్ లో డేంజర్ బోర్డుపై కాకి కూడా ఉండడం గమనార్హం.

ఈ మధ్యకాలంలో కాకి సెంటిమెంట్ గా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. బలగం సినిమా మొత్తం కాకి చుట్టూ తిరుగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది అలాగే నాని దసరా సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాలలో కూడా కాకినీ కీలకంగా చూపించారు. ఇప్పుడు రవితేజ సినిమాలో కూడా కాకి కనిపించడంతో ఈ సినిమాలో కూడా హిట్ సెంటిమెంట్ రిపీట్ అవబోతుందని తెలుస్తుంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus