తొలివలపు సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటుడు గోపీచంద్. ఈయన నటించిన మొదటి సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇలా హీరోగా తొలి ప్రయత్నంలోనే సక్సెస్ కాకపోవడంతో ఈయన అనంతరం నిజం వర్షం వంటి సినిమాలలో విలన్ పాత్రలలో నటించారు. ఇలా విలన్ పాత్రలలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి గోపీచంద్ అలాగే విలన్ గా కొనసాగకుండా తిరిగి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇలా యజ్ఞం సినిమాతో హీరోగా పరిచయమైనటువంటి ఈయన ఎంతో మంచి సక్సెస్ కావడంతో అనంతరం వరుసగా హీరోగా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
అయితే ఈ మధ్యకాలంలో గోపీచంద్ (Gopichand) నటించిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాయి. దీంతో ఈయనకు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయని చెప్పాలి. ఇలా సినిమా అవకాశాలు రాకపోవడంతో గోపీచంద్ తన రెమ్యూనరేషన్ విషయంలో ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఒకప్పుడు సినిమాకు 10 కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకునే ఈయన భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారని తెలుస్తుంది. ఈ విధంగా గోపీచంద్ రెమ్యూనరేషన్ తగ్గించుకోవడమే కాకుండా నిర్మాతలకు భారీ ఆఫర్ కూడా ఇచ్చారట.
తనకు రెమ్యూనరేషన్ మొత్తం ఒకేసారి కాకుండా నెల నెల శాలరీ రూపంలో ఇవ్వాలని చెప్పారట. ఇలా సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో తనకు ఎక్కడ సినిమా అవకాశాలు కోల్పోతాయన్న ఉద్దేశంతోనే ఈయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఒక్కో సినిమాకు గోపీచంద్ ఎన్ని నెలలు పని చేస్తే అన్ని నెలలు మాత్రమే తనకు రెమ్యూనరేషన్ ఇచ్చే విధంగా ఈయన నిర్మాతలతో డీల్ కుదుర్చుకున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసే అభిమానులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!