Nagarjuna: ఆ హీరోయిన్ కు లైఫ్ ఇస్తున్న నాగ్!

  • August 9, 2021 / 09:42 PM IST

కొత్త దర్శకులకు ఛాన్స్ ఇవ్వడంలో, ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో స్టార్ హీరో నాగార్జున ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉండే నాగార్జున ఈ ఏడాది వైల్డ్ డాగ్ సినిమాతో ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నారు. క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. నాగ్ ప్రవీణ్ సత్తారు కాంబో మూవీలో కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా గుల్ పనాగ్ నటిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో గుల్ పనాగ్ పాల్గొంటున్నారు. వరుసగా నాగార్జున తన సినిమాల్లో సీనియర్ హీరోయిన్లకు అవకాశాలను ఇస్తుండటం గమనార్హం. హిందీ, పంజాబీ సినిమాల్లో ఎక్కువగా నటించిన గుల్ పనాగ్ తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలో నటి దియామీర్జాకు ఛాన్స్ ఇవ్వగా ఈ సినిమాలో గుల్ పనాగ్ కు అవకాశం ఇచ్చారు.

ప్రస్తుతం గుల్ పనాగ్ వెబ్ సిరీస్ లలో ఎక్కువగా నటిస్తున్నారు. నాగ్ ప్రవీణ్ సత్తారు కాంబో మూవీ యాక్షన్ మూవీ కాగా వచ్చే సంవత్సరం సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఎక్కువగా సినిమా అవకాశాలు లేని గుల్ పనాగ్ కు నాగార్జున లైఫ్ ఇస్తారేమో చూడాల్సి ఉంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

Most Recommended Video



నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus