Guntur Kaaram Collections: ‘గుంటూరు కారం’ 9 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

  • January 21, 2024 / 04:42 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అతడు’ ‘ఖలేజా’ తర్వాత రూపొందిన మూవీ ‘గుంటూరు కారం’. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీలీల హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా స్పెషల్ రోల్ చేసింది. తమన్ సంగీత దర్శకుడు. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది.

అయినప్పటికీ కలెక్షన్స్ బాగానే వచ్చాయి అని చెప్పాలి. ఒకసారి 9 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 31.97 cr
సీడెడ్  9.14 cr
ఉత్తరాంధ్ర 11.15 cr
ఈస్ట్  8.55 cr
వెస్ట్  5.59 cr
గుంటూరు   7.80 cr
కృష్ణా  5.90 cr
నెల్లూరు  3.26 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 83.67 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  6.18 cr
 ఓవర్సీస్ 14.45 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 104 cr (షేర్)

‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాకి రూ.130.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.131 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 9 రోజులు పూర్తయ్యేసరికి రూ.104 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.27 కోట్ల షేర్ ను రాబట్టాలి. అది అంత ఈజీ టాస్క్ అయితే కాదు..కానీ ఇప్పటివరకు ఈ మూవీ బాగానే పెర్ఫార్మ్ చేసింది అని చెప్పాలి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus