కరోనా వైరస్… రెడీ టు రిలీజ్

  • October 1, 2020 / 01:44 PM IST

థియేటర్లలో తమ సినిమాను విడుదల చేయడానికి ముందుకు వచ్చే టాలీవుడ్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎవరు అనే ప్రశ్నకు తెర పడింది. తాను రెడీ అంటూ రామ్ గోపాల్ వర్మ మొదటి గంట కొట్టారు. అన్నపురెడ్డి ఎల్లారెడ్డి తో కలిసి రామ్ గోపాల్ వర్మ ప్రొడ్యూస్ చేసిన సినిమా ‘కరోనా వైరస్’. అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ లో స్టార్ట్ చేసి కంప్లీట్ చేశారు.

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు ఏ విధమైన భయభ్రాంతులకు గురవుతున్నారనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించారు. అక్టోబర్ 15న రిలీజ్ చెయ్యనున్నట్లు వర్మ తెలిపారు. “ఈ నెల 15 నుండి థియేటర్లు తెరుచుకుంటున్నాయి. చాలా సంతోషంగా ఉంది. లాక్ డౌన్ తర్వాత రిలీజ్ అయ్యే తొలి సినిమా మా కరోనా వైరస్ అని చెప్పడానికి సంతోషిస్తున్నా. ఫస్ట్ ఫిలిం టు రిలీజ్ ఆఫ్టర్ లాక్ డౌన్” అని ఆర్జివి ట్వీట్ చేశారు.

శ్రీకాంత్ అయ్యంగార్ వంశీ చాగంటి తదితరులు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. లాక్ డౌన్ సమయంలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా చూడటానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య, వాళ్ళ స్పందన చిత్ర పరిశ్రమ గమనిస్తుందని ఊహించవచ్చు.

Most Recommended Video

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus