Allu Arjun: హన్సిక విషయంలో అల్లు అర్జున్ అలా ప్రవర్తించారా?

Ad not loaded.

అల్లు అర్జున్ పరిచయం అవసరం లేని పేరు ఈయన హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చినటువంటి చిత్రం దేశముదురు ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఇప్పటికి ఈ సినిమా టీవీలలో ప్రసారమైన ప్రేక్షకులు కన్నార్పకుండా చూస్తూ ఉంటారు.ఇలా ఎంతో మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నటువంటి దేశముదురు సినిమా ద్వారా హన్సిక హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గాఎంట్రీ ఇవ్వకముందే హన్సిక పలు సినిమాలలో బాలనటిగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇక ఈ సినిమా ద్వారా ఈమె హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. మొదటి సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో వరుస తెలుగు తమిళ భాషలలో సినిమా అవకాశాలను అందుకొని హన్సిక ఎంతో బిజీగా గడిపారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హన్సిక దేశముదురు సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ తన పట్ల వ్యవహరించిన తీరు గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాలో ఓ సన్నివేశంలో అల్లు అర్జున్ నాకు తినిపించాల్సిన సన్నివేశం ఉంది అయితే నేను చిన్న చిన్న ముద్దలు తింటాను కానీ అల్లు అర్జున్ ఒకేసారి పెద్ద ముద్దలు పెట్టడంతో చిన్న చిన్న ముద్దులు పెట్టండి అని చెప్పాను.

దాంతో ఆయన నన్ను తిట్టి మరి పెద్ద పెద్ద ముద్దలు నాకు తినిపించారని ఈ సందర్భంగా హన్సిక తెలియజేశారు. అప్పటివరకు బాలనటిగా నటించిన నాకు హీరోయిన్గా ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది అయితే ఇందులో ఓ సన్నివేశంలో అల్లు అర్జున్ హగ్ చేసుకోవాల్సి వచ్చింది

ఆ సన్నివేశం ఎన్నిసార్లు ప్రయత్నించినా సరిగా రాకపోవడంతో (Allu Arjun) అల్లు అర్జున్ నా తలపై ఒకటి లాగి తనే వచ్చే హగ్ చేసుకుని షాట్ కంప్లీట్ చేశారు అంటూ ఈ సందర్భంగా దేశముదురు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సన్నివేశాల గురించి హన్సిక చేసినటు వంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus