నేను చెబితే మాత్రం మీరు వింటారా.. అర్థం చేసుకుంటారా : హరి తేజ

  • May 2, 2020 / 09:00 AM IST

తెలుగు నాట ‘బిగ్ బాస్’ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో ఎవరైనా బిజీగా ఉన్నారా అంటే హరితేజ అనే చెప్పాలి. అయితే అంతకు ముందే ఈమె త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ‘అ ఆ’ సినిమాతో ప్రేక్షకుల అటెన్షన్ డ్రా చేసింది అనుకోండి. అయితే బిగ్ బాస్ లో ఈమె గేమ్ ఆడిన తీరు చిన్న పిల్ల మనస్తత్వంతో కూడిన మాటలు ఈమెను మరింత పాపులర్ చేసాయి. ఇప్పుడు ఓ పక్క సినిమాలతోనూ మరో పక్క బుల్లితెర షోలతోనూ ఈమె మరింత పాపులర్ అయ్యింది.

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో కూడా ఈమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన కొత్త కొత్త ఫోటోలను షేర్ చెయ్యడంతో పాటు… ఆమె షూటింగ్ చేస్తున్న సినిమాల ఆన్ సెట్ పిక్స్ ను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె తన సోషల్ మీడియా అభిమానులతో కాసేపు ముచ్చటించింది. ఇందులో భాగంగా ఓ అభిమాని ” ‘హిట్’ సినిమాలో మీరు సిగరెట్ కాల్చిన సీన్ ఉంది.మీరు నిజ జీవితంలో కూడా సిగరెట్ కాలుస్తారా? అని ప్రశ్నించాడు.

అందుకు హరీతేజ జవాబిస్తూ ‘హిట్’ సినిమాలో నేను షీలా అనే పాత్రను చేశాను. అందులో నేను సిగరెట్ కాల్చిన సన్నివేశం ఉంది. సీన్ లో భాగంగా నేను సిగరెట్ కాల్చాను. అంతే కానీ నిజ జీవితంలో నేను సిగరెట్ కాల్చను అని తెలిపింది. ఇక నాని నిర్మాణంలో వచ్చిన హిట్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. థియేటర్లు మూతపడకపోతే కనుక ఇంకా పెద్ద హిట్ అయ్యి ఉండేది.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus