సీమంతం లో మెరిసిపోయిన బిగ్ బాస్ ఫేం హరితేజ.. ఫోటోలు వైరల్!

  • January 8, 2021 / 08:15 PM IST

త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అఆ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది హరితేజ. అటు తరువాత బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి బోలెడంత మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. నిజానికి సీజన్ 1లో ఈమెనే విన్నర్ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ పొరపాటు ఎక్కడ జరిగిందో తెలీదు కానీ.. ఈమె మాత్రం విన్నర్ కాలేదు. కానీ హౌస్ లో ఈమె బిహేవ్ చేసిన విధానానికి ఫ్యాన్స్ పెరిగారు అనేది సత్యం.

అటు తరువాత ఈమె వరుస సినిమాలలో అలాగే టీవీ షోలలో అవకాశాలు దక్కించుకుని మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. ఇదిలా ఉండగా..హరితేజ త్వరలో పండంటి బిడ్డకు జన్మ ను ఇవ్వ బోతుంది. కాగా ఇటీవల ఆమెకు సీమంతం జరిగింది. తన సీమంతం వేడుకలో హరితేజ పచ్చని చీర ధరించి కల కలలాడుతు కనిపించింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హరితేజ తాను ప్రెగ్నన్సీ ధరించిన దగ్గర నుండీ సినిమాలకు , టీవీ షోలకు దూరంగా ఉంటూ వస్తోంది.

కొన్నాళ్ల పాటు వాటికి బ్రేక్ ఇచ్చి… తల్లిగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి అనుకుంటుంది. 2020 లో హరితేజ… సరిలేరు నీకెవ్వరు, హిట్ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

1

2

3

4

5

6

7

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus