Hari Teja: హరితేజ కూతురు ఎంత క్యూట్ గా ఉందో చూడండి.. ఫోటోలు వైరల్..!

ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్, నటి అయిన హరితేజ అందరికీ సుపరిచితమే. కెరీర్ ప్రారంభంలో పలు సీరియల్స్ లో, సినిమాల్లో నటించిన హరితేజ అటు తర్వాత ‘బిగ్ బాస్ సీజన్ 1’ లో ఓ కంటెస్టెంట్ పాల్గొని ఫైనల్ వరకు వెళ్లి తన క్రేజ్ ను మరింతగా పెంచుకున్న సంగతి తెలిసిందే. వరుస సినిమా అవకాశాలను సంపాదించుకుంటూ వచ్చిన హరితేజ గతేడాది నుండీ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఆమె చివరిగా నటించిన మూవీ ‘హిట్’. ఇదిలా ఉండగా.. గతేడాది లాక్ డౌన్ టైం లో హరితేజ గర్భం దాల్చిన సంగతి తెలిసిందే.

తన బేబీ బంప్ తో ఫోటో షూట్లో కూడా పాల్గొంది. అంతేకాదు ఈమె సీమంతం ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అందుకే ఈమె సినిమాలకు దూరంగా ఉందని స్పష్టం చేసింది. తర్వాత హరితేజ ఓ పాపకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు తన పాప ఫేస్ ను ఈమె చూపించలేదు కానీ, ఎప్పటికప్పుడు ఆ పాపకి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది హరి తేజ. త్వరలోనే ఆమె కూతురిని పూర్తిగా చూపిస్తానని మొన్నామధ్య చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా తన కూతురికి భూమిక దీపక్ రావ్ అంటూ నామకరణం కూడా చేసింది. ‘భూమి అంటే సహనంతో కూడుకుని ఉంటుంది అని అంతా అనుకుంటున్నారు.. కానీ వాళ్లకు ఏం తెలుసు సహనాన్ని పరీక్షిస్తే భూకంపాలే అని’ అంటూ కూడా చెప్పుకొచ్చింది హరితేజ. ఇదిలా ఉండగా… మొత్తానికి హరితేజ తన కూతురి ఫోటోలను షేర్ చేసింది. ఆ బేబీ ఎంత క్యూట్ గా ఉందో మీరే చూడండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

 

 

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus