బిగ్ బాస్ 4: నోరు పారేసుకున్న సోహైల్..!

  • November 16, 2020 / 01:56 PM IST

బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం నామినేషన్స్ బాగా హీటెక్కబోతున్నాయి. రీసంట్ గా రిలీజ్ చేసిన ప్రోమోలో హారికకి సోహైల్ కి గట్టిగానే పడింది. శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ముందు సోహైల్ ని వేస్ట్ అని హారిక క్యాజువల్ గా అనేసింది. సరదా సరదాకి మాట్లాడిన మాటలని అప్పుడే సోహైల్ సీరియస్ గా తీసుకున్నాడు. కానీ అఖిల్ సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత ఈ ఊసే ఎత్తలేదు. ఏదైతే ఆదివారం ఎపిసోడ్ ఎండ్ అయ్యిందో , నామినేషన్స్ లో తన పవర్ ని చూపిస్తున్నాడు. ఇదే విషయంలో హారికతో ఆర్గ్యూమెంట్ పెట్టుకున్నాడు. ఇంతలేవు నీకు.. ఏంటీ చప్పుడు చేయకు అన్నట్లుగా మాట్లాడాడు. హారిక కూడా సోహైల్ కి గట్టి కౌంటర్ వేసింది. నీకంటే డబుల్ డోన్ లో అరవగలను అంటూ సాలిడ్ గా సోహైల్ కి ఇచ్చింది.

ఇక ఈవారం ఒకర్ని ఒకరు నామినేట్ చేస్కున్నారు. మరోవైపు లాస్యకి – అరియానాకి కూడా గట్టిగానే ఆర్గ్యూమెంట్ అవుతోంది. అంతేకాదు, అభిజిత్ సోహైల్ ని నామినేట్ చేస్తూ భాష మార్చుకోమని లాస్ట్ టైమ్ కూడా చెప్పా.. ఇప్పుడు కూడా చెప్తున్నా అంటే, సోహైల్ నా లాంగ్వేజ్ ఇంతే, అది నా ఊతపదం అంటూ అభిజిత్ ని టీజ్ చేశాడు. తనలా పాష్ గా మాట్లాడటం నాకు రాదు అంటూ అఖిల్ తో కలిసి ఫన్ చేశాడు. మరి వేడెక్కిపోయిన ఈ నామినేషన్స్ లో ఎవరు నామినేట్ అయ్యారు. ఈవారం ఎవరు ఎలిమినేషన్స్ లోకి వచ్చారు అనేది ఆసక్తిరం. అదీ మేటర్.


‘కమిట్‌ మెంటల్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus