Hebah Patel: చీరకట్టులో కుమారి 21 F అందం అదిరిందబ్బా.. ట్రెడిషనల్ లుక్స్ కు కుర్రాళ్లు ఫిదా!

హెబ్బా పటేల్ అనగానే రెండు తెలుగు రాష్ట్రాల కుర్రాళ్ల లకు కుమారి 21 F గుర్తుకు వస్తోంది. ఈ సినిమా ద్వారా హెబ్బా పటేల్ రెండు తెలుగు రాష్ట్రాల కుర్రాళ్ల హృదయాల్లో తిష్ట వేసింది. ఆ సినిమాలో ఈ బ్యూటీ గ్లామర్కు, గ్రామర్కు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలో ఈ భామ చెప్పిన డైలాగులు ఇప్పటికీ ఫేమస్. ఈ సినిమా ద్వారా ఒక్కసారిగా టాలీవుడ్ లో హెబ్బా పేరు మార్మోగింది. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి.

కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి కూడా. కానీ సడెన్ గా హెబ్బా ఇండస్ట్రీ నుంచి ఫేడవుట్ అయింది. చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవ్వడం షురూ అయింది. క్రమంగా ఈ బ్యూటీ సినిమాలకు దూరమైంది. ఇటీవల మళ్లీ హెబ్బా స్పీడ్ పెంచింది. ఇంతకుముందు గ్లామర్ ను మాత్రమే నమ్ముకున్న హెబ్బా ఇప్పుడు తనలోని టాలెంట్ కు పని చెప్పింది. అందుకే కంటెంట్ ఉన్న సినిమాలకు జై కొడుతూ తనలోని నటనతో అభిమానులను ఫిదా చేస్తోంది.

తాజాగా (Hebah Patel) ఈ బ్యూటీ వ్యవస్థ అనే ఓ సినిమాలో నటించింది. ఈ చిత్రంలో హెబ్బా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ బ్యూటీ పలికించిన హావభావాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. హెబ్బాలో ఇంత టాలెంట్ ఉందని ఊహించలేదని సర్ ప్రైజ్ అయ్యారు. సోషల్ మీడియాలోనూ హెబ్బ చాలా పాపులర్. ఈ బ్యూటీ సినిమాలు చేయనప్పుడు కూడా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యేది. తరచూ ఫొటోషూట్స్ చేస్తూ అభిమానులను అలరించేది. అయితే హెబ్బా ఎక్కువగా ట్రెండీ, బోల్డ్ అవుట్ ఫిట్స్లో కనువిందు చేస్తుంది.

కానీ తాజాగా వ్యవస్థ మూవీ ప్రమోషన్స్లో బాగంగా ఎక్కువగా ట్రెడిషనల్ ఔట్ ఫిట్స్లో కనిపిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ క్రీమ్ కలర్ చీరలో సందడి చేసింది. తలలో మల్లెపూలు.. నుదుటిన బొట్టు.. నిండైనకట్టుతో అచ్చతెలుగు పదహారణాల పడుచులా కనిపించి ఆశ్చర్యపరించింది. చీరకట్టులో హెబ్బాను చూసి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. హెబ్బా.. చీరకట్టులో నీ అందం ఏముందబ్బా అంటూ సోషల్ మీడియా లో కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. ట్రెండీగానే కాదు ట్రెడిషనల్గానూ హెబ్బా సూపరెహే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ భామ అందానికి మెస్మరైజ్ అవుతున్న కుర్రాళ్లు హార్ట్ ఎమోజీస్తో తమ ప్రేమను కురిపిస్తున్నారు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus