2 ఏళ్ల క్రితం సినీ నటి హేమ(Hema) బెంగళూరులోని ఓ రేవు పార్టీలో పోలీసులకి దొరకడం, ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు ఆరోపణలు రావడం, ఆమెకు టెస్టులు వంటివి కూడా చేయడం జరిగింది.
అయితే ఇందులో నిజం లేధంటూ ఎప్పటికప్పుడు ఆమె ఖండిస్తూనే ఉంది. అసత్య ప్రచారాలు చేసి తన కెరీర్ ను నాశనం చేశారని,తల్లి చావుకి కూడా కారణం అయ్యారంటూ మీడియాపై దుమ్మెత్తుపోసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.
తర్వాత ఈ వ్యవహారాన్ని అంతా మర్చిపోయారు. కానీ హేమ మాత్రం తన కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినట్టు చెబుతూ సోషల్ మీడియాలో వంటివి పోస్ట్ చేయడం కూడా మనకి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈరోజు సడన్ గా హేమ ఓ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో ఆమె మళ్ళీ ఆ రేవు పార్టీ గురించి, డ్రగ్స్ గురించి స్పందించింది. తనకు హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని మీడియా హైలెట్ చేయలేదని, కానీ డ్రగ్స్ ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం అంతా తెగ ప్రచారం చేశారని ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
ఇదే క్రమంలో ఆమె.. ఆ కష్ట సమయంలో చిరంజీవి అండగా నిలిచారని. తన మనుషుల్ని పంపి చేతనైన సాయం చేశారని హేమ తెలిపింది. అలాగే తన నెక్స్ట్ సినిమాలో మంచి ఛాన్స్ ఇప్పిస్తానని కూడా చిరు మాటిచ్చినట్టు హేమ చెప్పుకొచ్చింది. అయితే ఆ వెంటనే ఇలాంటి టైమ్లో దాసరి నారాయణరావు గారు లేని లోటు కనపడుతుందని, ఆయన ఉంటే తనకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదంటూ హేమ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఓ పక్క చిరంజీవి చేసిన సాయం గురించి చెబుతూనే.. మరోవైపు దాసరి లేని లోటు ఇండస్ట్రీలో కనిపిస్తుందంటూ హేమ పలకడం అందరికీ షాకిచ్చే అంశం. ఇక హేమ కేసు విషయంపై ఆమె చెప్పుకోవడం తప్ప.. ఆమెకు అండగా నిలిచిన వారెవరూ స్పందించింది లేదు.