Unstoppable3: ‘అన్‌స్టాపబుల్‌ 3’ ఈసారి ఆల్‌ మిక్సర్‌ పక్కా అంట! ఆ మజా మళ్లీ ఇవ్వడానికి!

  • October 9, 2023 / 05:45 PM IST

‘అన్‌స్టాపబుల్‌’ అంటూ ఆహాలో వచ్చిన బాలయ్య తొలి సీజన్‌ను అన్‌స్టాపబుల్‌గానే నిర్వహించాడు. బాలయ్యలో కొత్త కోణం చూసిన ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ‘భలే బాలయ్య’ అంటూ తెగ మెచ్చేసుకున్నారు. హీరోల ఫ్యానిజం అనే ఫీలింగ్‌ను పక్కనపెట్టి మరీ చూసి భారీ హిట్‌ చేశారు. అయితే రెండో ‘అన్‌స్టాపబుల్‌’ దగ్గరకు వచ్చేసరికి ‘నానా స్టాపబుల్‌’ అయ్యింది. అలాగే రెస్పాన్స్‌ కూడా మిక్స్‌డ్‌గా మారింది. ఇప్పుడు దాన్ని తిరిగి మార్చుకోవడానికి బాలయ్య మూడోసాఇ ‘అన్‌స్టాపబుల్‌’ అనబోతున్నాడు.

‘అన్‌స్టాపబుల్‌ 3’ (Unstoppable3) సీజన్‌కి ఇటీవల బాలయ్యతో ఓకే చెప్పించుకున్నారట అల్లు అరవింద్‌. ఈ దసరాకు తొలి ఎపిసోడ్‌ ఉంటుంది అని కూడా అంటున్నారు. ‘భగవంత్‌ కేసరి’ సినిమా ప్రచారంతో మూడో సీజన్‌ ప్రారంభమవుతుందట. అయితే మూడో సీజన్‌ ఎలా సాగుతుంది, ముగింపు ఎలా ఉంటుంది అనేదే ఇప్పుడు ప్రశ్న. రెండో సీజన్‌ నిర్వహణలో కాస్త రాజకీయం కలిపి కిచిడీ వండే ప్రయత్నం చేశారు అనే టాక్‌ ఉంది. ఇప్పుడు మూడో సీజన్‌లోనూ అదే చేస్తారని టాక్‌.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం దృష్ట్యా మూడో సీజన్‌లో కాస్త పొలిటికల్ హీట్‌ ఎక్కువగానే ఉండొచ్చు అని టాక్‌. అలాగే స్టార్‌ హీరోల తాకిడిని పెంచే ప్రయత్నమూ చేస్తున్నారట. ఇందులో భాగంగా తొలి ఎపిసోడ్‌ను మెగాస్టార్‌ చిరంజీవితో చేయాలనే ఆలోచన ఉందంటున్నారు. కుదరకపోతే ముగింపు ఎపిసోడ్‌ అయినా ఆయన చేస్తే బాగుంటుంది అంటున్నారు. ఈ మేరకు ఆ బాధ్యత అల్లు అరవింద్‌ భుజాన వేసుకున్నారట.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సీజన్‌లో చిరంజీవి, తెలంగాణ మంత్రి కేటీఆర్, సూపర్ స్టార్ రజనీకాంత్, రామ్ చరణ్, రాజశేఖర్, శివరాజ్ కుమార్, మమ్ముట్టి తదితర నటులు రావొచ్చని సమాచారం. వీళ్లకు ఏపీ రిలేటెడ్‌ రాజకీయ నాయకులు యాడింగ్‌ అని చెబుతున్నారు. వీటి సంగతి త్వరలో తొలి ఎపిసోడ్‌ షూటింగ్‌ మొదలవుతుంది. అప్పుడు పుల్‌ క్లారిటీ వచ్చేస్తుంది. లేదంటే పుకార్ల షికార్లు ఎలాగూ ఉన్నాయిగా.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus