RGV, Ashu Reddy: కిందా మీదా పడి వర్మ తీసిన ఫొటో ఇదే!

సోషల్‌ మీడియాలో గత కొన్ని రోజుల నుండి చూస్తుంటే రామ్‌గోపాల్‌ వర్మ్‌నే కనిపిస్తున్నాడు. యూట్యూబ్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఇలా ఎక్కడ చూసినా రామ్‌గోపాల్‌ వర్మనే కనిపిస్తున్నాడు. అయితే ఒక్కో వీడియోలో ఒక్కో అవతారంలో కనిపిస్తున్నాడు. అయితే ఈ రీసెంట్‌ సోషల్‌ మీడియా వైరల్‌ తుపాను మొదలైంది మాత్రం అషు రెడ్డి వీడియోతోనే చెప్పాలి. వర్మను అషు రెడ్డి ఓ ఇంటర్వ్యూ చూసింది. ఈ క్రమంలో ఆమెను వర్మ ఓ విపరీతమైన యాంగిల్‌లో ఫొటో తీశాడు తెలుసుగా. అదే మొదలు.

అషు రెడ్డిని వర్మ ఫొటో తీస్తున్న దృశ్యాన్ని ఆయన మనుషులే రికార్డు చేశారు. దానికి వర్మ ఘనంగా తన సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో వర్మ అభిమానులు, ద్వేషులు రెచ్చిపోయారు. వర్మ కళాపోషణ కొందరికి నచ్చితే, ఇంకొందరికి వర్మ పైత్యం పదింతలు అయ్యింది అంటూ కామెంట్లకు పని చెప్పారు. అయితే ఆ క్రమంలో వర్మ బెంచీ కింద దూరి… కిందా మీదా పడి తీసిన ఫొటో ఇప్పుడు బయటకు వచ్చింది. అవును అషు రెడ్డి తొడలను హైలైట్‌ చేసి వర్మ తీసిన ఫొటో ఇదే.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో వర్మ చేయని, చేయలేని సినిమాలంటూ ఏమీ ఉండవు అంటారు. ఇండస్ట్రీ గర్వించే ఎన్నో సినిమాలు తెరకెక్కించారు వర్మ. ఆయన మనసు పెడితే ఇంకెన్నో మంచి సినిమాలు తీయొచ్చు. అయితే రీసెంట్‌గా ఆయన మనసు జిమ్‌ ఇంటర్వ్యూలు, బెంచీల కింద దూరి ఫొటోలు తీయడాల్లో బిజీగా ఉన్నాడు. ఈ రెండూ లేకపోతే యువ నటుల్ని పట్టుకొని ఊగిపోతూ, కింద పడి దొర్లుతూ డ్యాన్స్‌లు చేస్తున్నారు. ఆయన లైఫ్‌ ఆయన ఇష్టమే… అలాగే ఆయన పనులను కామెంట్లు చేయడమూ జనాల ఇష్టమే కదా. అదే చేస్తున్నారు మరి. వర్మ ఎప్పటిలాగే వాటిని చూసి ఎంజాయ్‌ చేస్తున్నారు.


Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus