Darshan, Rajamouli: దర్శన్ కు వివాదాలు కొత్త కాదుగా.. జక్కన్న గురించి అలా అన్నారా?

  • July 10, 2024 / 09:11 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళికి  (Rajamouli)ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. రాజమౌళి సాధించిన రికార్డులు, అవార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని చెప్పవచ్చు. తన సినీ కెరీర్ లో జక్కన్న వివాదాలకు దూరంగా ఉంటూ విజయవంతంగా కెరీర్ ను కొనసాగించడం జరిగింది. ప్రస్తుతం మహేశ్ (Mahesh Babu) సినిమాతో రాజమౌళి బిజీగా ఉండగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే కన్నడ స్టార్ హీరో దర్శన్ (Darshan) గతంలో ఒక సందర్భంలో జక్కన్న గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రాజమౌళి కూడా అందరిలా సాధారణ దర్శకుడేనని అంతకు మించి ఆయనలో ప్రత్యేకత ఏమీ లేదని దర్శన్ అన్నారు. సలార్ సినిమా రిలీజ్ సమయంలో కూడా దర్శన్ ఒకింత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా విమర్శలు మూటగట్టుకున్నారు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ ఇప్పటికే అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎన్నో మలుపులు చోటు చేసుకోగా దర్శన్ ఈ కేసులో శిక్ష కచ్చితంగా అనుభవించే ఛాన్స్ అయితే ఉందని నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దర్శన్ ఈ కేసు నుంచి బయటపడటం సులువు కాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దర్శన్ చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్నారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. దర్శన్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల పరిస్థితి ఏంటనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. దర్శన్ కు కొత్త సినిమా ఆఫర్లు రావడం కష్టమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దర్శన్ కు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ల గురించి కూడా నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. దర్శన్ గురించి అభిమానులలో వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ఈ విషయాలు తెలిసి దర్శన్ కు వివాదాలు కొత్త కాదుగా అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus