‘వివాహ భోజనంబు’ హీరో అతనే…!

Advertisement

కమెడియన్ లు హీరోలుగా మారడం కొత్తేమీ కాదు. అందులో తప్పు కూడా లేదు. అయితే కమెడియన్ లు హీరోలుగా మారిన తరువాత … కేవలం హీరోలుగానే కొనసాగుతాం అంటేనే పెద్ద ప్రాబ్లెం..! మంచి కమెడియన్ ను ప్రేక్షకులు దూరమైపోతారు. ఆ ప్లేస్ ను మరో కమెడియన్ వచ్చి రీప్లేస్ చేస్తాడు. కానీ హీరోలుగా మారిన తర్వాత అవకాశాలు కరువైతే.. మళ్ళీ కమెడియన్ గా అవకాశాలు వస్తాయని చెప్పలేము. ఇప్పటికే సునీల్ ను ఈ విషయంలో ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

తరువాత సప్తగిరి కూడా ఈ లిస్టులో చేరాడు అనుకోండి. ఇప్పుడు మరో కమెడియన్ కూడా ఈ లిస్టులో చేరే ప్రమాదం ఉందేమో అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. విషయం ఏమిటంటే… ఇటీవల సందీప్ కిషన్ నిర్మాతగా ఓ సినిమాని అనౌన్స్ చేసాడు. ‘వివాహ భోజనంబు’ అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే హీరో పేరు మాత్రం అనౌన్స్ చెయ్యలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో సత్య హీరోగా నటిస్తున్నాడని తెలుస్తుంది.

ప్రస్తుతం వెన్నెల కిశోర్ తరువాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్ సత్య అనడంలో సందేహం లేదు. మరి అతను కూడా హీరోగా మారితే టాలీవుడ్ కు కమెడియన్ల కొరత పెరిగినట్టే అవుతుంది. మరి సత్య మనసులో ఏముందో…!

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus