ఓ స్టార్ ఫ్యామిలీ నుండీ హీరోని లాంచ్ చెయ్యడం అంటే మాటలు కాదు. నటనకు అనుభవం లేని స్టార్ వారసులను.. ఆ స్టార్ హీరో అభిమానులకు చేరువయ్యేలా సినిమా చెయ్యాలి. అంతేకాదు హిట్ ఇవ్వాలి కూడా..! ఇందులో ఏ ఒక్కటి జరగకపోయినా ఫ్యాన్స్ క్షమించరు.ఈ విషయంలో ఆ స్టార్ హీరోకి అలాగే డైరెక్టర్ కి.. మనస్పర్ధలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ విషయం చాలా సార్లు ప్రూవ్ అయ్యిందట కూడా.! ‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్’ అంటారు కదా.. అలా కచ్చితంగా మొదటి సినిమాకే హీరోకి ఇమేజ్ తెచ్చిపెట్టే విధంగా దర్శకులు సినిమా చెయ్యాల్సి ఉంటుంది. రాజమౌళి వంటి డైరెక్టర్ కే చరణ్ ని లాంచ్ చేసే అవకాశం వస్తే వదులుకున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. అది ఎంత కష్టమైన పనో..!
ఒక్క రాజమౌళి మాత్రమే కాదు మరికొంత మంది హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న దర్శకులు కూడా ఉన్నారు. ఇక ఆ డైరెక్టర్లు ఎవరు?వారు మిస్ చేసుకున్న హీరోలు ఎవరు? ఓ లుక్కేద్దాం రండి :
1) ఎస్.ఎస్.రాజమౌళి – రాంచరణ్ :
‘అసలు చరణ్ బాడీ లాంగ్వేజ్ ఏంటో తెలీదు.. డైలాగ్స్ ఎలా చెప్తాడో తెలీదు.. డ్యాన్స్ ఎలా చేస్తాడో తెలీదు. అవేమీ తెలీకుండా సినిమాని చెయ్యలేను అనిపించింది. అందుకే చరణ్ ను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాను’ అని రాజమౌళినే తెలిపాడు.
2) తేజ – అల్లు అర్జున్ :
‘జయం’ సినిమాని మొదట అల్లు అర్జున్ తో చెయ్యాలి అనుకున్నాడు తేజ. కానీ ఎందకో కె.రాఘవేంద్ర రావు గారి చేతుల్లో పెట్టారు అల్లు అరవింద్ గారు..!
3) కృష్ణవంశీ – మహేష్ బాబు :
కృష్ణగారి అబ్బాయి అంటే అభిమానుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. అందుకే ‘మొదటి సినిమా నేను చెయ్యలేను.. తరువాత సినిమా చేస్తాను’ అని చెప్పి తప్పుకున్నాడట కృష్ణవంశీ.
4)ఎస్.వి.కృష్ణా రెడ్డి- మహేష్ బాబు :
‘ ‘యమలీల’ చిత్రాన్ని మహేష్ బాబు తో చెయ్యాలని ఉంది’ అని ఎస్.వి.కృష్ణారెడ్డి గారు కృష్ణ గారికి చెప్పారట. కానీ ‘మహేష్ చదువు ఇంకా పూర్తికాలేదు.. ఇప్పుడు వద్దు’ అని కృష్ణ గారు సమాధానం ఇచ్చారట.
5) పూరి జగన్నాథ్- నాగ చైతన్య :
చిరంజీవిలానే.. నాగార్జున కూడా నాగ చైతన్య ను పూరి డైరెక్షన్లో లాంచ్ చెయ్యాలి అనుకున్నారట. కానీ స్టొరీ వర్కౌట్ కాలేదట.
6) విక్రమ్ కె కుమార్ – అఖిల్ :
‘మనం’ సినిమా వచ్చిన టైంలోనే అఖిల్ ను కూడా విక్రమ్ కుమార్ డైరెక్షన్లో లాంచ్ చెయ్యాలి అనుకున్నారట నాగార్జున. 2,3 స్టొరీలు కూడా విన్నారు. అవి నచ్చక వినాయక్ చేతిలో పెట్టారని తెలుస్తుంది.
7)కె.రాఘవేంద్ర రావు – రానా :
శేఖర్ కమ్ముల ‘లీడర్’ కంటే ముందే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు డైరెక్షన్లో రానాని లాంచ్ చెయ్యాలి అని సురేష్ బాబు అనుకున్నరాట. కానీ ఎందుకో అది కుదరలేదని తెలుస్తుంది.
8)క్రిష్ జాగర్లమూడి – వరుణ్ తేజ్ :
‘ముకుంద’ సినిమా కంటే ముందు క్రిష్ డైరెక్షన్లో సినిమా చెయ్యాలి అని వరుణ్ – నాగబాబు అనుకున్నారట. కానీ మొదటి సినిమాలో కమర్షియల్ మరియు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటే బాగుంటుంది అని చిరు సూచించడంతో వరుణ్ ను.. శ్రీకాంత్ అడ్డాల చేతిలో పెట్టారట నాగబాబు.
9) శ్రీకాంత్ అడ్డాల – నాగ చైతన్య :
‘కొత్త బంగారు లోకం’ సినిమా నాగ చైతన్యతోనే చేద్దాం అని శ్రీకాంత్ అడ్డాల కథ వినిపించాడట. కానీ నాగార్జున ఈ కథను ఓకే చెయ్యలేదట.
10)రాజమౌళి – ఎన్టీఆర్ :
నిజానికి ‘స్టూడెంట్ నెంబర్1’ చిత్రమే మొదట రిలీజ్ కావాల్సిందట. కానీ షూటింగ్ లేట్ అవ్వడం వల్ల .. ‘నిన్ను చూడాలని’ తో ఎన్టీఆర్ హీరోగా లాంచ్ అయ్యాడు. ఇలా ఎన్టీఆర్ ను కూడా లాంచ్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు రాజమౌళి. అయితే చరణ్, ఎన్టీఆర్ లతో మొదటి సినిమా చేసే ఛాన్స్ మిస్ అయిన రాజమౌళి.. ఇప్పుడు వారిద్దరితో ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా చేస్తుండడం విశేషం.