ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలకు బాలీవుడ్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ‘బాహుబలి'(సిరీస్) తోనే మన తెలుగు సినిమాలకు అక్కడ మంచి డిమాండ్ ఏర్పడింది అనుకుంటే మాత్రం పొరపాటే..! అంతకు ముందు నుండే మన సూపర్ హిట్ సినిమాలను ఎన్నో అక్కడ రీమేక్ చేశారు. కొన్నేళ్ల పాటు హిట్ కొట్టలేక సతమతమవుతున్న సల్మాన్ ఖాన్ మన ‘పోకిరి’ సినిమాని రీమేక్ చేసి హిట్టు కొట్టి కం బ్యాక్ ఇచ్చాడు. ఆ తరువాత ‘కిక్’ ‘రెడీ’ వంటి ఎన్నో సినిమాలను రీమేక్ చేశాడు. ఇక ‘విక్రమార్కుడు’, ‘పరుగు’, ‘వర్షం’, ‘క్షణం’ వంటి సినిమాలు కూడా బాలీవుడ్ లో రీమేక్ అయ్యి మంచి ఫలితాలను అందుకున్నాయి.
ఇక ‘బాహుబలి’ తరువాత ‘అర్జున్ రెడ్డి'(హిందీ రీమేక్ ‘కబీర్ దాస్’) ‘సాహో’ వంటి చిత్రాలు కూడా బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇక యూట్యూబ్లో అయితే తెలుగు సినిమాల హిందీ వెర్షన్లకు 100 మిలియన్ల పైనే వ్యూస్ నమోదవుతుండడం మనం చూస్తూనే వస్తున్నాం. ఈ నేపథ్యంలో ఎన్నో తెలుగు సినిమాలను అక్కడ రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
1) అల వైకుంఠపురములో
2)ఎఫ్2
3)జెర్సీ
4)నిన్ను కోరి
5)ఎం.సి.ఎ
6)అరుంథతి
7)హిట్
8)డిజె – దువ్వాడ జగన్నాథం
9)మత్తు వదలరా
10)టాక్సీ వాలా
11)బ్రోచేవారెవరురా
12)ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ
13)భాగమతి
14) ఆర్.ఎక్స్.100
15) దూకుడు