Hero Kartikeya got engaged: నిరాడంబరంగా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న కార్తికేయ!

‘ఆర్‌ఎక్స్‌ 100’తో టాలీవుడ్‌ హీరోగా పరిచయమై… తర్వాత వరుస సినిమాల్లో హీరోగా నటిస్తూ రాణిస్తున్న కార్తికేయ గుమ్మకొండ ఓ ఇంటివాడుకాబోతున్నాడు. ఇటీవల సమీప బంధువులు, మిత్రుల సమక్షంలో ఆయన నిశ్చితార్థం అయినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఎంగేజ్‌డ్‌ అంటూ రాసి ఉన్న వాట్సాప్‌ స్టేటస్‌లోని పిక్‌ అది. ఆ ఫొటోలో కార్తికేయ, అతని కాబోయే భార్య ఉన్నారు. ఫొటోలో దిగువ ఎంగేజ్‌డ్‌ అని మాత్రమే ఉంది. అయితే ఈ కార్యక్రమం 22న రాత్రి ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో జరిగిందని తెలుస్తోంది.

వివిధ కారణాల రీత్యా ఈ వేడుకకు చాలా తక్కువ మందినే ఆహ్వానించారు. అయితే ఈ వేడుకకు సంబంధించి కార్తికేయ తన సోషల్‌ మీడియా ఖాతాల్లో ఎలాంటి పోస్టులు ఇప్పటివరకు చేయలేదు. ఇక కార్తికేయ సినిమాల సంగతి చూస్తే… ఇటీవల ‘చావు కబురు చల్లగా’ సినిమాతో ప్రేక్షకులు ముందుకొచ్చి మెప్పించాడు. ప్రస్తుతం అజిత్‌ ‘వాలిమై’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇవి కాకుండా ‘రాజా విక్రమార్క’ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus