రేయ్ రేయ్.. అల్లరి నరేష్ పేరు మార్చేయ్!

  • March 1, 2021 / 06:21 AM IST

అల్లరి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నరేష్ ఆ సినిమా క్లిక్కవ్వడంతో అదే పేరుతో ఇన్నాళ్లు కొనసాగుతూ వచ్చాడు. ఒక విధంగా నరేష్ సినిమాలకు ఆ ట్యాగ్ కరెక్ట్ గా సెట్టవుతు వచ్చింది. తండ్రి ఈవివి సత్యనారాయణ సపోర్ట్ తో ఎన్నో కామెడీ సినిమాలు చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. అయితే 8ఏళ్ళ నుంచి దూరంగా ఉన్న విజయం మొత్తానికి నాందితో దగ్గరయ్యింది.

సుడిగాడు అనంతరం పెద్దగా సక్సెస్ చూడని నరేష్ కు నాంది ఒక మంచి విజయాన్ని అంధించడమే కాకుండా నటుడిగా కూడా స్థాయిని పెంచింది. ఇక సినిమాను టాలీవుడ్ సెలబ్రెటీలు చాలా మంది స్పెషల్ షోలు వేయించుకొని మరి చూసేస్తున్నారు. ఇక ఇటీవల నేచురల్ స్టార్ నాని కూడా చూసేశాడు. నాని నరేష్ చాలా ఏళ్లుగా మంచి స్నేహితులని అందరికి తెలిసిన విషయమే.

ఇక నాంది సినిమాపై ట్విట్టర్ ద్వారా స్పందించిన నాని.. నరేష్ ను పేరు మార్చుకోవాలని సలహా ఇచ్చాడు. రేయ్ రేయ్ రేయ్.. అల్లరి నరేష్ పేరు మార్చేయ్ ఇంక. అల్లరి గతం భవిష్యత్తుకు ఇది నాంది. నిన్ను చూసి సంతోషిస్తున్నాను రా. భవిష్యత్తులో నీలోని నటుడిని మరింత కొత్తగా చూపిస్తావని ఆశిస్తున్నాను.. అంటూ నాని నరేష్ పై ప్రశంసలు కురిపించాడు. ఇక నరేష్ నెక్స్ట్ దిల్ రాజు ప్రొడక్షన్ లో ఒక సినిమా చేయడానికి. ప్రయత్నాలు చేస్తున్నాడు.

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి రేర్ ఫోటో గ్యాలరీ!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus