నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

నేచురల్ స్టార్ నాని.. ‘అష్టా చమ్మా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. నిజానికి ఆ చిత్రంలో నానిని హీరోగా అనుకోలేదు మన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. ఓ పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరోతో ఆ సినిమా చెయ్యాలి అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో అతను హ్యాండ్ ఇవ్వడంతో.. ఎవ్వరూ ఊహించని విధంగా నానిని ఫైనల్ చేసేసారు. ఇంకో విషయం ఏమిటంటే.. ఆ చిత్రానికి గాను నానికి పారితోషికం ఇవ్వలేదట. నాని కూడా ఏమీ ఆశించకుండానే అవకాశం రావడమే గొప్ప అన్నట్టు ఆ సినిమాని కంప్లీట్ చేసాడు.

ఇక అప్పటి నుండీ నాని ప్రయాణం అందరికీ తెలిసిందే. ‘రైడ్’ ‘భీమిలి కబడ్డీ జట్టు’ ‘అలా మొదలైంది’ వంటి డిఫరెంట్ సినిమాలు చేస్తూ రాజమౌళి కంట్లో పడ్డాడు. అలా నానికి ‘ఈగ’ సినిమాలో అవకాశం దక్కింది. అయితే అటు తరువాత ఎన్నో ప్లాప్ లు మూటకట్టుకున్న నాని.. మారుతీ డైరెక్షన్లో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో కోలుకున్నాడు. అక్కడి నుండీ నాని జయాపజయాలను లెక్కచెయ్యకుండా దూసుకుపోతున్నాడు. త్వరలో ‘టక్ జగదీష్’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నాని. అసలు నాని గురించి ఇంత ప్రస్తావన ఇప్పుడు ఎందుకు అంటే.. ఈరోజు నాని పుట్టినరోజు కాబట్టి.

ఈ నేపథ్యంలో నాని రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

1) సుకుమారుడు

2) తడాకా

3) గుండె జారి గల్లంతయ్యిందే

4) ఉయ్యాల జంపాల

5) సుప్రీమ్

6) ఊపిరి

7) మహానటి(ఏ.ఎన్.ఆర్ పాత్ర)

8) జాను

9) శ్రీకారం

10) దుల్కర్ సల్మాన్ – హను రాఘవపూడి ప్రాజెక్టు(టైటిల్ ఇంకా పెట్టలేదు)

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus