Nani, Anjana: నాని భార్య అంజనాను అలా ఫీల్ అవుతాడంట!

సినీ నటుల్లో లవ్ మ్యారేజ్ చేసుకునే వారే ఎక్కువ శాతం ఉంటారు. ఇండస్ట్రీకి చెందిన వారినే కొందరు లవ్ చేసి పెళ్లిచేసుకోగా.. ఇంకొందరు మాత్రం ఇండస్ట్రీకి సంబంధం లేని వారిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం చూస్తున్నాం. అదే బాటలో నాచురల్ స్టార్ నాని తన పెళ్లి తంతు ముగించారు. తాజాగా ఓ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ విశేషాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు నాని.

ఇందులో భాగంగానే తాజా ఇంటర్వ్యూలో తన మ్యారేజ్ సీక్రెట్స్ బయటపెట్టారు నాని. తన లవ్‌ స్టోరీని, తన ప్రేమ పెళ్లికి ముందే ఏం జరిగిందో తెలుపుతూ అన్ని విషయాలు రివీల్‌ చేశారు నాని. తనకు పిల్లనివ్వడానికి అమ్మాయి తరఫువారు చాలా టెన్షన్‌ పడ్డారని చెబుతూ ఓపెన్ అయ్యారు. రియల్‌ లైఫ్‌లో నాని లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తమది ఇంటర్‌ కాస్ట్ మ్యారేజ్‌ కాదన్నారు నాని. తన లవ్‌ స్టోరీలో ఎలాంటి ఇబ్బందులేవీ ఎదుర్కోలేదని..

అంతా బాగానే జరిగింది కానీ అమ్మాయి తరఫున వాళ్లకు చిన్న టెన్షన్‌ ఉండేదని చెప్పారు. తన భార్య అంజన వాళ్లది సైంటిస్ట్ నేపథ్యం గల ఫ్యామిలీ అని చెప్పిన నాని.. తమ ప్రేమ విషయంలో వాళ్ళ పేరెంట్స్ సానుకూలంగానే ఉన్నప్పటికీ ఆ సమయంలో తాను హీరోగా స్ట్రగులింగ్‌లో ఉండటంతో పిల్లనివ్వడానికి కాస్త టెన్షన్‌ పడ్డారని తెలిపారు. తమ అమ్మాయిని ఇవ్వాలా వద్దా అని బాగా ఆలోచించారని తెలిపారు.

నాని (Nani) గురించి తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే నాని ఓవైపు భార్యతో మరోవైపు లవర్ తో ఎంజాయ్ చేస్తున్నాడని ఎవరికి తెలియని సీక్రెట్ బయటపడింది అంటూ కొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు. అయితే నాని ఓవైపు భార్య మరోవైపు లవర్ అంటే మీరు తప్పుగా అర్థం చేసుకునేరు. నాని ఇంట్లో ఉన్నప్పుడు తన భార్య అంజనా ని భార్య గా ఫీల్ అవుతాడట. బయట ఆమెనే లవర్ గా ఫీలవుతారట.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus